Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనిదే తప్పు.. ఆ ఒక్క వికెట్ SRH కొంపముంచింది- గవాస్కర్ (Video)

ప్చ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని ఓటమి. క్వాలిఫయిర్-1లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. అన్ని విభాగాల్లో విఫలమై ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే టైటిల్ రేసులో హైదరాబాద్ ఇంకా నిలిచే ఉంది. క్వాలిఫయిర్-2లో గెలిస్తే ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్‌కు చేరుతుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్ మిచెల్ స్టార్క్ (3/34) మూడు, వరుణ్ చక్రవర్తి (2/26) ధాటికి 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనకు దిగిన కేకేఆర్ 13.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. శ్రేయస్ అయ్యర్ (58*; 24 బంతుల్లో, 5x4, 4x6), వెంకటేశ్ అయ్యర్ (51*; 28 బంతుల్లో, 5x4, 4x6) అజేయ అర్ధశతకాలు సాధించారు.

KKR vs SRH Sunil Gavaskar Criticizes Untimely Dismissal of Rahul Tripathi for Sunrisers Hyderabad

అయితే సన్‌రైజర్స్ ఓ దశలో 39 పరుగులకే నాలుగు వికెట్లు పీకల్లోతు కష్టాల్లో పడింది. హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో, 3x4, 1x6)తో కలిసి రాహుల్ త్రిపాఠి 62 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. అయితే క్లాసెన్ ఔటైన తర్వాత అబ్దుల్ సమద్ (16; 12 బంతుల్లో, 2x6) క్రీజులోకి వచ్చాడు. కానీ అబ్దుల్ చేసిన తప్పిదానికి ఎస్‌ఆర్‌హెచ్ కోలుకోలేని స్థితికి చేరుకుంది.

అసలేం జరిగిదంటే.. 13 ఓవర్లకు హైదరాబాద్ 121/5‌తో నిలిచింది. కానీ ఎస్‌ఆర్‌హెచ్ ఒక్కసారిగా 126/9తో ఆలౌటయ్యే ప్రమాదంలో పడింది. అయిదు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి రనౌటవ్వడంతో వికెట్ల పతనం మొదలైంది. నరైన్ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించిన అబ్దుల్ సమద్.. రాహుల్ త్రిపాఠిని రనౌట్ చేశాడు.

రాహుల్ త్రిపాఠి రనౌట్ గురించి వ్యాఖ్యాతగా ఉన్న సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. కీలక సమయంలో కుదురుకున్న బ్యాటర్ రనౌటవ్వడం సన్‌రైజర్స్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నాడు. లేని పరుగు కోసం ప్రయత్నించిన అబ్దుల్ సమద్‌‌దే తప్పు అని పేర్కొన్నాడు. ''పూర్తి‌గా అబ్దుల్ సమద్‌దే తప్పు. అక్కడ పరుగే లేదు. బాల్‌ను కేకేఆర్ ఫీల్డర్లు స్టాప్ చేశారు. ఇది అనవసరమైన వికెట్. రాంగ్ టైమ్‌లో సన్‌రైజర్స్ వికెట్ కోల్పోయింది'' అని గవాస్కర్ అన్నాడు.‌

Story first published: Wednesday, May 22, 2024, 8:21 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+