Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రషీద్ ‌ఖాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం.. అతనిపై ఆధిపత్యం చెలాయిస్తా: శుభ్‌మన్‌ గిల్‌

KKR vs SRH: Shubman Gill says Kolkata players are well prepared to tackle spin threat of Rashid Khan

అబుదాబి: ఐపీఎల్ సీజ‌న్-13లో భాగంగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో 8వ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజ‌న్‌లో హైద‌రాబాద్, కోల్‌క‌తా‌కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్న‌ర్ సేన విరాట్ కోహ్లీ సార‌థ్యంలోని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) జ‌ట్టు చేతిలో ఓడిపోగా.. దినేశ్ కార్తీక్ సార‌థ్యంలోని కోల్‌క‌తా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో హైదరాబాద్‌తో తలపడే రెండో టీ20లో కచ్చితంగా గెలుస్తామని కోల్‌క‌తా యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ధీమా వ్యక్తం చేశాడు.

రషీద్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటాం:

రషీద్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటాం:

'ఐపీఎల్ టోర్నీ జరుగుతున్నా కొద్ది వికెట్ నెమ్మదిగా మారి స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి మీడియం పేసర్లు మొదట్లో ప్రభావం చూపిస్తున్నారు. స‌న్‌రైజ‌ర్స్ జట్టులో అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు.ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌ పటిష్టంగా ఉంది. దాంతో మేము కూడా ఆ విభాగంపై పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌ చేశాం. రషీద్ ‌ఖాన్‌ను ఎదుర్కొనేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అతనిపై నేను ఆధిపత్యం చెలాయిస్తా. పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలో ప్రణాళికలు వేసుకున్నాం. వాటిని ఆటలో ఆచరణలో పెట్టాలి' అని గిల్‌ చెప్పాడు.

మాక్కూడా మంచి స్పిన్ అటాక్ ఉంది:

మాక్కూడా మంచి స్పిన్ అటాక్ ఉంది:

'మా జట్టులో ఇయాన్ ‌మోర్గాన్‌, నితిశ్‌ రాణాలతో మిడిల్‌ఆర్డర్ మరింత‌ బలంగా మారింది. వారిద్దరితో లెప్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ ప్రయోగించడమే కాకుండా.. రషీద్‌ ఖాన్‌ లాంటి అత్యుత్తమ స్పిన్నర్‌పై ఆధిపత్యం చెలాయిస్తాం. కెప్టెన్ దినేష్ కార్తీక్ మరియు స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‌తో మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు జట్టు విజయంలో భాగం కావాలని చెప్పారు. మా జట్టులో చాలా వైవిధ్యాలు ఉన్నాయి. మాకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, చైనామన్ లెగ్ స్పిన్నర్ ఉన్నారు. మాక్కూడా మంచి స్పిన్ అటాక్ ఉంది' అని శుభ్‌మన్‌ గిల్‌

పేర్కొన్నాడు.

జట్టులోకి నబీ?:

జట్టులోకి నబీ?:

హైదరాబాద్‌ జట్టు‌లో రషీద్ ఖాన్‌‌, భువనేశ్వర్ ‌కుమార్‌ కీలక బౌలర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చెలరేగితే ఏ జట్టుకైనా ప్రమాదం పొంచి ఉంటుంది. బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో మీడియం పేసర్‌‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడ్డాడు. దీంతో అతడు ఈ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. అతడి స్థానంలో అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం హైదరాబాద్‌ ఏడో స్థానంలో ఉండగా.. కోల్‌కతా చివరి స్థానంలో కొనసాగుతోంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, శుభమన్ గిల్, దినేశ్ కార్తీక్ (కీపర్, కెప్టెన్), నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, నిఖిల్ నాయక్/రాహుల్ త్రిపాఠి, ప్యాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, సందీప్ వారియర్.

సన్ రైజర్స్ హైదరాబాద్: జానీ బెయిర్‌స్టో (కీపర్), డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, కేన్ విలియమ్సన్/మహ్మద్ నబీ, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, నటరాజన్/ఖలీల్ అహ్మద్.

Story first published: Saturday, September 26, 2020, 18:51 [IST]
Other articles published on Sep 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+