Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతి విశ్వాసమా.. ఆత్మ విశ్వాసమా? ఎంత పనిచేశావ్ కమిన్స్! (Memes)

అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయిర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. అన్ని విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ షోతో ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ ఓటమిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పేలవమైన ఆటతో పాటు వ్యూహాత్మకంగా దారుణంగా విఫమమయ్యారని నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో, 3x4, 1x6), ప్యాట్ కమిన్స్ (30; 24 బంతుల్లో, 2x4, 2x6), అబ్దుల్ సమద్ (16; 12 బంతుల్లో, 2x6) మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3/34) మూడు, వరుణ్ చక్రవర్తి (2/26) రెండు వికెట్లతో సత్తాచాటాడు.

KKR vs SRH Pat Cummins Overconfidence Blunder Sparks Viral Memes

అనంతరం ఛేదనకు దిగిన కేకేఆర్ 13.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. శ్రేయస్ అయ్యర్ (58*; 24 బంతుల్లో, 5x4, 4x6), వెంకటేశ్ అయ్యర్ (51*; 28 బంతుల్లో, 5x4, 4x6) అజేయ అర్ధశతకాలు సాధించారు. కమిన్స్ (1/38), నటరాజన్ (1/22) చెరో వికెట్ సాధించారు. అయితే టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆత్మ విశ్వాసంతో కాకుండా అతి విశ్వాసంతో కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందని నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. అహ్మదాబాద్ పిచ్ మ్యాచ్ కొనసాగే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తెలిసి కూడా కమిన్స్ ఆ నిర్ణయం తీసుకోవడంపై ఆరెంజీ ఆర్మీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా డకౌటవ్వడం ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులను కలవరపెడుతోంది.

మ్యాచ్ ఓటమి అనంతరం కమిన్స్ సైతం టాస్ నిర్ణయం తమ ఓటమిపై ప్రభావం చూపించిందని చెప్పడం గమనార్హం. అయితే క్వాలిఫయిర్-1 ముందు పిచ్‌ను అర్థం చేసుకోవడంలో మేధావిని అని తన గురించి తానే గొప్పలు చెప్పుకున్న కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం ఏంటని నెట్టింట ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Story first published: Wednesday, May 22, 2024, 10:18 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+