For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs SRH: కోల్‌క‌తాపై స‌న్‌రైజ‌ర్స్ బిగ్ విక్ట‌రీ.. హైద‌రాబాద్‌ను గెలిపించిన ప్ర‌ధాన అంశాలు ఇవే!

srh

ఐపీఎల్ 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతుంది. తాజాగా కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఆరెంజ్ ఆర్మీ 7 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. సీజ‌న్‌ను రెండు వ‌రుస ప‌రాజ‌యాల‌తో ప్రారంభించిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా 3 విజ‌యాలు సాధించిన స‌న్‌రైజ‌ర్స్ అద‌ర‌గొట్టింది. అయితే కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను గెలిపించిన ప్ర‌ధాన అంశాలను ఓ సారి చ‌ర్చించిద్దాం.

ప‌వ‌ర్‌ప్లేలోనే 3 వికెట్లు

టాస్ గెలిచి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప‌వ‌ర్‌ప్లేలోనే టాప్ 3 వికెట్లు తీయ‌డం సానుకులాంశంగా చెప్ప‌వ‌చ్చు. ఓపెన‌ర్ ఆరోన్ ఫించ్‌ను మార్కో జాన్స‌న్ 7 ప‌రుగుల‌కే ఫెమిలియ‌న్ చేర్చాడు. ఇక ఐదో ఓవ‌ర్లో మ‌రో ఓపెన‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్‌ను 5 ప‌రుగుల‌కే, సునీల్ న‌రైన్‌ను 6 ప‌రుగుల‌కే ఇద్ద‌రిని ఒకే ఓవ‌ర్లో న‌ట‌రాజ‌న్ ఔట్ చేశాడు. దీంతో ఆ జ‌ట్టు ప‌వ‌ర్‌ప్లే పూర్తి కాకుండానే 31 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. దీంతో ఆరంభంలోనే స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌పై ప‌ట్టుబిగించింది.

పేస్‌తో దెబ్బ‌కొట్టిన ఉమ్రాన్ మాలిక్‌

గంట‌కు దాదాపు 150 కిలో మీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేసే స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్‌లోనూ త‌న పేస్‌తో చెల‌రేగాడు. క‌ష్టాల్లో ఉన్న కోల్‌క‌తాను ఆదుకోని క్రీజులో కుదురుకున్న ఆ జ‌ట్టు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ప‌దో ఓవ‌ర్లో అద్భుత బంతితో మాలిక్ బౌల్డ్ చేశాడు. దీంతో అప్ప‌టివ‌ర‌కు బాగా ఆడిన శ్రేయ‌స్ 28 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద వెనుదిరిగాడు.

ఇది స‌న్‌రైజ‌ర్స్‌కు ప్ల‌స్ పాయింట్‌గా మారింది. అలాగే 13వ ఓవ‌ర్లో మ‌రో సారి చెల‌రేగిన ఉమ్రాన్ మాలిక్.. జాక్స‌న్‌(7)ను త‌క్కువ స్కోర్‌కే ప‌రిమితం చేశాడు. అలాగే కీల‌క‌మైన 16వ ఓవ‌ర్లో కేవ‌లం 2 ప‌రుగులే ఇచ్చాడు. మొత్తంగా 4 ఓవ‌ర్ల కోటాను పూర్తి చేసి 26 ప‌రుగులే ఇచ్చి 2 కీల‌క వికెట్లు తీశాడు. ఇలా స‌న్‌రైజ‌ర్స్ విజ‌యంలో మాలిక్ కీల‌క‌పాత్ర పోషించాడు.

దుమ్ములేపిన రాహుల్ త్రిపాఠి

ఇక 176 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను రాహుల్ త్రిపాఠి ఒంటి చేతితో గెలుపు వైపు తీసుకెళ్లాడు. 39 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం ఒత్తిడిగా లోను కాకుండా తొలి బంతి నుంచే కేకేఆర్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడి చేశాడు. ఆరంభం నుంచి ఫోర్లు, సిక్సులు కొట్టి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో ఎయిడెన్ మాక్ర‌మ్‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

ఈ క్ర‌మంలో 21 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేసిన త్రిపాఠి ఈ సీజ‌న్‌లో మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. మొత్తంగా 6 సిక్సులు, 4 ఫోర్ల‌తో 37 బంతుల్లోనే 71 ప‌రుగులు చేశాడు. 14.2 ఓవ‌ర్ల‌లోనే జ‌ట్టు స్కోర్‌ను 133 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా ఔట‌య్యాడు. అంటే జ‌ట్టును అప్ప‌టికే త్రిపాఠి విజ‌యానికి చేరువ చేశాడు. రాహుల్ త్రిపాఠి ఔట‌య్యాక స‌న్‌రైజ‌ర్స్ విజ‌యానికి మ‌రో 34 బంతుల్లో 43 ప‌రుగులు మాత్ర‌మే కావాల్సి ఉందంటే అత‌ను ఏ స్థాయిలో ఆడాడో అర్థం చేసుకోవ‌చ్చు.

గెలిపించిన మాక్ర‌మ్‌

రాహుల్ త్రిపాఠి క్రీజులో ఉన్నంతసేపు అత‌నికి ఎయిడెన్ మాక్ర‌మ్ మంచి మ‌ద్ద‌తు ఇచ్చాడు. త్రిపాఠి ఔటైన వెంట‌నే జ‌ట్టు భారాన్ని త‌న‌పై వేసుకోని ముందుకు న‌డిపిచాడు. ఈ క్ర‌మంలో 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌రింత దూకుడుగా ఆడి రాహుల్ త్రిపాఠి ఔట‌య్యాక స్కోర్ బోర్డులో ఎక్క‌డా వేగం త‌గ్గ‌నివ్వ‌లేదు. చివ‌రికి క‌మిన్స్ బౌలింగ్‌లో వ‌రుస‌గా రెండు సిక్సులు కొట్టి స‌న్‌రైజ‌ర్స్‌ను గెలిపించాడు. ఇలా రాహుల్ త్రిపాఠి ఔటైన త‌ర్వాత స‌న్‌రైజ‌న్స్‌ను గెలిపించ‌డంలో బ్యాటింగ్‌లో ఎయిడెన్ మాక్ర‌మ్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ అంశాలు కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ గెల‌వ‌డంలో కీల‌కంగా మారాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

స్కోర్లు

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌: 175-8

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌: 176-3

Story first published: Saturday, April 16, 2022, 9:09 [IST]
Other articles published on Apr 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+