Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: నితీష్‌ రానా హాఫ్ సెంచ‌రీ.. ర‌స్సెల్ విధ్వంసం.. స‌న్‌రైజ‌ర్స్ ముందు భారీ ల‌క్ష్యం

KKR vs SRH: Kolkata player Nitish Rana Half century and Sunrisers Hyderabad Target 176 runs

నితీష్ రానా(54) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డానికి తోడు చివ‌ర్లో ఆండ్రూ ర‌స్సెల్(49*) విధ్వంసం సృష్టించ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ముందు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 176 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. ప‌వ‌ర్‌ప్లేలో స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్లు స‌త్తా చాటిన‌ప్ప‌టికీ రానా, ర‌స్సెల్ ఆదుకోవ‌డంతో కేకేఆర్ భారీ స్కోర్ సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్ 3, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్ల‌తో స‌త్తా చాటారు.

జాన్సెన్‌కు తొలి వికెట్‌

జాన్సెన్‌కు తొలి వికెట్‌

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మార్కో జాన్సెన్ తొలి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్లోనే ఓపెన‌ర్ ఆరోన్ ఫించ్‌ను 7 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఫెమిలియ‌న్ పంపాడు. జాన్సెన్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ నికోల‌స్ పూర‌న్‌కు క్యాచ్ ఇచ్చి ఫించ్ ఔటయ్యాడు.

 తొలి బంతికే న‌ట్టూ వికెట్‌

తొలి బంతికే న‌ట్టూ వికెట్‌

మ్యాచ్‌లో ఐదో ఓవ‌ర్‌ను బౌలింగ్ చేసిన న‌ట‌రాజ‌న్ తొలి బంతికే కోల్‌క‌తా ఓపెన‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అద్భుత బౌలింగ్‌తో న‌ట‌రాజ‌న్ వేసిన బంతి ఏకంగా మిడిల్‌స్టంప్‌కు త‌గిలింది. దీంతో 13 బంతులు ఎదుర్కొన్న వెంక‌టేష్ అయ్య‌ర్ 6 ప‌రుగులే చేసి నిరాశ‌గా ఫెమిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన సునీల్ న‌రైన తొలి బంతికే సిక్సు కొట్టాడు. కానీ ఆ త‌ర్వాతి బంతికి న‌ట‌రాజ‌న్ మ‌ళ్లీ త‌న ప్ర‌తాపం చూపెట్టాడు. అద్భుతంగా పుల్‌టాస్ బాల్ వేశాడు. ఆ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించిన సునీల్ న‌రైన్ ఫీల్డ‌ర్ శ‌శాంక్ సింగ్‌కు దొరికిపోయాడు. దీంతో వేసిన తొలి ఓవ‌ర్లోనే న‌ట‌రాజ‌న్ రెండు వికెట్లు సాధించాడు. దీంతె కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 31 ప‌రుగుల‌కు 3 టాప్ వికెట్లు కోల్పోయింది. అంటే పవ‌ర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

చెల‌రేగిన ఉమ్రాన్ మాలిక్

చెల‌రేగిన ఉమ్రాన్ మాలిక్

ఈ క్ర‌మంలో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్, నితీష్ రానా కోల్‌క‌తా ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించారు. అయితే ప‌దో ఓవ‌ర్లో అద్భుత యార్క‌ర్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ (28 ర‌న్స్‌, 3 ఫోర్లు)ను ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేయ‌డంతో 70 ప‌రుగుల‌కు కేకేఆర్ నాల్గో వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత మ‌రోసారి చెలరేగిన ఉమ్రాన్ మాలిక్ 13వ ఓవ‌ర్లో షెల్డ‌న్ జాక్స‌న్ (7)ను ఫెమిలియ‌న్ చేర్చాడు. జాక్స‌న్ భారీ షాట్‌కు ప్ర‌యత్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న న‌ట‌రాజ‌న్‌కు దొరికిపోయాడు.

రానా హాఫ్ సెంచ‌రీ

రానా హాఫ్ సెంచ‌రీ

ఈ క్ర‌మంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను ఆదుకున్న నితీష్ రానాకు 32 బంతుల్లో ఐపీఎల్‌లో 14వ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అలాగే ర‌స్సెల్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. కోల్‌క‌తా స్కోర్ 142 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా.. 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల‌తో 54 ప‌రుగులు చేసిన రానాను న‌ట‌రాజ‌న్ 18వ ఓవ‌ర్లో ఫెమిలియ‌న్ చేర్చాడు. ఇక 19వ ఓవ‌ర్లో క‌మిన్స్‌(3)ను భువి ఫెమిలియ‌న్ చేర్చాడు. దీంతో 153 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా ఏడో వికెట్ కోల్పోయింది.

రస్సెల్ మెరుపులు

రస్సెల్ మెరుపులు

ఇక చివ‌రి ఓవ‌ర్ తొలి బంతికే హ‌కీమ్ ఖాన్‌(5)ను సుచిత్ క్లీన్‌బౌల్డ్ చేయ‌డంతో 158 ప‌రుగుల వద్ద కోల్‌క‌తా 8వ వికెట్ కోల్పోయింది. మొద‌టి 3 బంతుల‌కు సుచిత్ ఒకే ప‌రుగు ఇచ్చాడు. కానీ చివ‌రి 3 బంతులు ర‌స్సెల్ 2 సిక్సులు, ఒక ఫోర్ బాద‌డంతో ఆ ఓవ‌ర్లో ఏకంగా 17 ప‌రుగులు ఇచ్చాయి. 4 ఫోర్లు, 4 సిక్సుల‌తో 25 బంతుల్లోనే 49 ప‌రుగులు చేసి ర‌స్సెల్ నాటౌట్‌గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కోల్‌క‌తా 8 వికెట్లు కోల్పోయి 175 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, జాన్స‌న్, భువ‌నేశ్వ‌ర్, సుచిత్ త‌లో వికెట్ తీశారు. కాగా చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో కేకేఆర్ 55 రన్స్ చేసింది.

Story first published: Friday, April 15, 2022, 21:49 [IST]
Other articles published on Apr 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+