Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Qualifier 1: SRHకు గుడ్ న్యూస్..‌‌KKRకు బ్యాడ్ న్యూస్!

ఐపీఎల్-2024‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక క్లైమాక్స్ ఫైట్ మొదలుకానుంది. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు క్వాలిఫయిర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. టాప్-2లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ క్వాలిఫయిర్-1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.

ఓడిన జట్టు రేపు జరగనున్న ఎలిమేనటర్ మ్యాచ్ విజేతతో కలిసి క్వాలిఫయిర్-2లో పోటీపడాల్సి ఉంటుంది. అయితే అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరగనున్న క్వాలిఫయిర్-1లో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్లు సూపర్ ఫామ్‌లో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి. దీంతో ఇవాళ హోరాహోరీ పోరు సాగడం ఖాయంగా అనిపిస్తోంది.

KKR vs SRH KKR Stars Struggle in Ahmedabad as SRH players Shines

అయితే రికార్డుల పరంగా చూస్తే సన్‌రైజర్స్‌పై కోల్‌కతాదే పైచేయి. ఇప్పటివరకు ఇరు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడగా కేకేఆర్ 17 సార్లు, ఎస్‌ఆర్‌హెచ్ తొమ్మిది సార్లు గెలిచాయి. దీంతో ఆరెంజ్ ఆర్మీలో కాస్త టెన్షన్ మొదలైంది. అంతేగాక రిజర్వ్ డే రూల్ కూడా సన్‌రైజర్స్ అభిమానులను కలవరపెడుతోంది. ఇవాళ జరగనున్న మ్యాచ్ రద్దయితే, రిజర్వ్ డే రోజున మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే టేబుల్ టాపర్ అయిన కేకేఆర్‌ను విజేతగా ప్రకటించి ఫైనల్‌‌కు క్వాలిఫై చేస్తారు.

కానీ, కొన్ని విషయాలు ఆరెంజ్ ఆర్మీని సంతోషంలో ముంచెత్తుతున్నాయి. ఇవాళ వర్షం ముప్పు లేదు. అంటే మ్యాచ్ సజావుగా సాగడం ఖాయమే. మరోవైపు మ్యాచ్ వేదిక అయిన అహ్మదాబాద్‌లో కేకేఆర్ స్టార్ ప్లేయర్లకు చెత్త రికార్డు ఉంది. కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్ చాలా ప్రమాదకరమైన ప్లేయర్. స్పిన్నర్‌గా ప్రత్యర్థిని భయపెట్టే నరైన్.. ఈ సీజన్‌లో బ్యాటర్‌గా మరింత సత్తాచాటుతున్నాడు. అయితే అహ్మదాబాద్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన నరైన్ మూడు సార్లు డకౌటవ్వడం గమనార్హం.

అంతేగాక అహ్మదాబాద్‌లో రసెల్ రికార్డు కూడా పేలవంగా ఉంది. ఇక్కడ అతని స్ట్రైక్‌రేటు 140 మాత్రమే. ఈ మైదానంలో బౌండరీలు దూరంగా ఉంటాయి. దీన్ని ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు సద్వినియోగం చేసుకుని రసెల్ వికెట్‌ను సులువుగా సాధించవచ్చు. బంతితోనూ రసెల్ సత్తాచాటలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఇక్కడ ఒక్క వికెట్ సాధించలేపోయాడు.

మరోవైపు ఈ పిచ్‌పై భువనేశ్వర్‌కు మెరుగైన రికార్డు ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన భువీ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. కనీసం బంతికో పరుగు కూడా ఇవ్వలేదు. వీటితో పాటు ఫామ్‌లో ఉన్న కేకేఆర్ ఓపెనర్ సాల్ట్ కూడా టోర్నీకి దూరమవ్వడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశమే. ఇవన్నీ ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్ కాగా, కేకేఆర్ బ్యాడ్ న్యూస్‌గా మారాయి.

Story first published: Tuesday, May 21, 2024, 9:40 [IST]
Other articles published on May 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+