Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: సవ్యసాచి.. తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించేశాడు!

KKR vs SRH: ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 80 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌‌లో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్‌కు తొలిసారి ఐపీఎల్ లో ఆడే అవకాశం లభించింది. ఈ ఆటగాడు తన తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఘనత ఎవరూ సాధించలేదు.

రెండు చేతులతో బౌలింగ్ చేసిన బౌలర్.. ఇదే మొదటిసారి
ఈ మ్యాచ్ లో శ్రీలంక స్పిన్ బౌలర్ కమిందు మెండిస్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఐపీఎల్ అరంగేట్ర చేసే అవకాశం లభించింది. ఈ ఆటగాడిని ఐపీఎల్ 2025 మెగావేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్‌లోనే కమిందు మెండిస్ ఇప్పటివరకు ఐపీఎల్ లో చూడని అద్భుతాన్ని చేశాడు. ఈ మ్యాచ్ లో కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

KKR vs SRH Kamindu Mendis Bowls With Both Hands and Makes History in His IPL Debut

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీలు ఇద్దరు క్రీజులో ఉన్నారు. కమిందు మెండిస్ ఈ ఇద్దరు బ్యాటర్లకు వేర్వేరు చేతులతో బౌలింగ్ వేశాడు. వెంకటేష్ అయ్యర్ ఎడమ చేతి వాటం బ్యాటర్ కాబట్టి మెండిస్ తన కుడి చేతితో అతనికి బౌలింగ్ చేశాడు. మరోవైరు రఘువంశీ కుడిచేతి వాటం బ్యాటర్ కాబట్టి మెండిస్ తన ఎడమ చేతితో అతనికి బౌలింగ్ చేశాడు. మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కేకేఆర్ తరపున వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇది కాకుండా అంగ్క్రిష్ రఘువంశీ 50 పరుగులు చేశాడు. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ తరపున బౌలింగ్ చేసిన వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలో 3 వికెట్లు పడగొట్టారు.

Story first published: Friday, April 4, 2025, 8:34 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+