Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR-SRH: నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్.. ఈడెన్‌లో ఈసారి గెలుపెవరిది?

KKR vs SRH: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నేడు(ఏప్రిల్ 2) కోల్‌కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడటంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉన్నాయి. అజింక్యా రహానే నేతృత్వంలోని కేకేఆర్, ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగే ఈ పోరు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది. క్కడ పరుగుల వర్షం కురవడం ఖాయం. అయితే నేటి మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్‌పై కాస్త ఎక్కువ గడ్డి కనిపిస్తోంది. ఇది స్పిన్నర్ల కంటే వేగవంతమైన బౌలర్లకు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉంది. గత నెలలో ఇక్కడే జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ (న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా) మ్యాచ్ పిచ్‌నే ఈరోజు కూడా ఉపయోగించనున్నారు. పిచ్ త్వరగా విడిపోయే అవకాశం లేనందున బ్యాటింగ్, బౌలింగ్ మధ్య హోరాహోరీ పోరు సాగొచ్చు.

KKR vs SRH IPL 2026 Match Preview Eden Gardens Pitch Report Head to Head and Playing XI

హెడ్ టు హెడ్
ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 10 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 11 మ్యాచ్‌ల్లో కేకేఆర్ 8 సార్లు గెలవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 3 సార్లు మాత్రమే నెగ్గింది. గణాంకాలను బట్టి చూస్తే సొంత గడ్డపై కోల్‌కతా జట్టే హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది.

వాతావరణం, మ్యాచ్ సమయం
కోల్‌కతాలో నేడు వాతావరణం కాస్త వేడిగా ఉండే అవకాశం ఉంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే ఛాన్స్ ఉంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 30 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఆటగాళ్లు కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది, అయితే వేడి కారణంగా మంచు ప్రభావం తక్కువగా ఉండవచ్చని అంచనా. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

అందరి కళ్లు వీరిపైనే..
నేడు జరగనున్న మ్యాచ్‌లో ఇరు జట్ల వైపు నుంచి పలువురు స్టార్ ఆటగాళ్లపై అందరి కళ్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి కెప్టెన్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు కోల్‌కతా జట్టులో అజింక్య రహానే, రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్ళు రాణించడం జట్టుకు చాలా అవసరం. క్రీడాభిమానులు ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో లేదా జియోహాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు (SRH):
ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, లియామ్ లివింగ్‌స్టోన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఇషాన్ మలింగ, శివం మావి, స్మరణ్ రవిచంద్రన్, జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, కామిందు మెండిస్, బ్రైడన్ కార్స్, డేవిడ్ పేన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్.

ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 అంచనా: ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఇషాన్ మలింగ,

కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు (KKR):
అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామరూన్ గ్రీన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రచిన్ రవీంద్ర, బ్లెస్సింగ్ ముజారబానీ, నవదీప్ సైనీ.

కేకేఆర్ ప్లేయింగ్ 11 అంచనా: అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Thursday, April 2, 2026, 9:13 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+