వార్నర్ హాఫ్ సెంచరీ వృథా: ఈ సీజన్‌ని ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్


హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో ఆరంభించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కోల్‌కతా చేధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో నితీశ్ రాణా (68: 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించగా... చివర్లో ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) భారీ సిక్సర్లతో ఆటను మలుపు తిప్పాడు. రాబిన్ ఉతప్ప (35) ఫర్వాలేదనిపించాడు. శుభమన్ గిల్ (18 నాటౌట్: 10 బంతుల్లో 2 సిక్సులు) చివర్లో మెరుపులు మెరిపించడంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా విజయం సాధించింది.
అంతకముందు డేవిడ్ వార్నర్ (85: 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

ఏడాది తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం
ఏడాది తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన వార్నర్ తొలి వికెట్‌కి జానీ బెయిర్‌స్టో (39: 35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ (40 నాటౌట్: 24 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్... సొంతగడ్డపై కోల్‌కతాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

నిరాశపరిచిన యూసప్ ఫఠాన్
మరోవైపు సన్‌రైజర్స్ హిట్టర్ యూసఫ్ పఠాన్ (1: 4 బంతుల్లో) నిరాశపరచగా.. మనీశ్ పాండే (8 నాటౌట్) చివర్లో ఫరవాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల టెస్టు మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడి స్థానంలో భువనేశ్వర్‌కు పగ్గాలు అప్పజెప్పారు.

భువీ తొలిసారి కెప్టెన్‌గా
దాంతో ఐపీఎల్‌లో భువీ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఏడాది నిషేధం వేటు పడటంతో 2018 ఐపీఎల్ సీజన్‌కి దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఈ మ్యాచ్‌తో మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications