Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: ఇంపాక్ట్ సబ్‌గా వస్తానని ముందే తెలుసు.. వైభవ్ ప్లాన్ మామూలుగా లేదు!

KKR vs SRH: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడం ద్వారా ఐపీఎల్ 2025లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటింగ్ నుంచి బౌలింగ్ వరకు అద్భుతంగా రాణించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టును కేకేఆర్ బౌలర్లు కేవలం 120 పరుగులకే ఆలౌట్ చేశారు. దీనికి ప్రధానంగా ఫాస్ట్ బౌలర్ వైభవ్ అరోరాకు ఘనత దక్కుతుంది. వైభవ్ అరోరా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌ను దారుణంగా దెబ్బతీశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన వైభవ్ ఆరోరా.. మూడు కీలక వికెట్లను తీసుకున్నాడు.

మ్యాచ్ తర్వాత తన ప్రణాళిక ఏంటో చెప్పిన వైభవ్ అరోరా..
ఈ మ్యాచ్‌లో వైభవ్ అరోరా 4 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 3 ముఖ్యమైన వికెట్లను పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమికి కారణమయ్యాడు. తన అద్భుతమైన ప్రదర్శనకు వైభవ్ అరోరా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత వైభవ్ మాట్లాడుతూ.. "నేను ఇంపాక్ట్ సబ్ గా వస్తానని ముందే తెలుసు. దాని కోసం ముందుగునే సిద్ధమయ్యాను. పిచ్ ఎలా స్పందిస్తుందో, స్వింగ్ ఉందా, బంతి ఆగుతూ వస్తుందా అనేది బయట నుంచే అంచనా వేశాను. ఐదు-ఆరో ఓవర్లో యార్కర్లు, కట్టర్లు వేయడం ముఖ్యమనిపించింది ఎందుకంటే బంతి అప్పటివరకు స్వింగ్ అవ్వదు. ఒక్కో బ్యాటర్ కు ఒక్కోలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం" అని వైభవ్ అరోరా చెప్పుకొచ్చాడు.

KKR vs SRH Impact Player Vybhav Arora Shines with 3 Key Wickets

ఈ ఆటగాళ్లు కూడా బాగా బౌలింగ్ చేశారు..
వైభవ్ తో పాటు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బౌలింగ్ చేస్తున్నప్పుడు వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా ఆండ్రీ రస్సెల్ 1.4 ఓవర్లలో 21 పరుగులకు 2 వికెట్లు, హర్షిత్ రాణా 3 ఓవర్లలో 15 పరుగులకు ఒక వికెట్ పడగొట్టారు.

బ్యాటింగ్‌లో రాణించిన వెంకటేష్ అయ్యర్, రఘువంశీ
ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఇందులు వెంకటేష్ అయ్యర్ అత్యధికంగా 60 పరుగులు చేశాడు. దీనితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ 50, కెప్టెన్ అజింక్య రహానే 38, రింకూ సింగ్ 17 బంతుల్లో అజేయంగా 32 పరుగులు సాధించారు.

Story first published: Friday, April 4, 2025, 10:17 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+