Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: విజేతగా నిలిచేది ఆ జట్టే..జోస్యానికి కారణాలు ఇవే!

ఐపీఎల్‌-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టేబుల్ టాప్‌లో నిలిచిన తొలి రెండు జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయిర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. సమవుజ్జీలైన ఇరు జట్ల మధ్య ఇవాళ పోరు హొరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్లు క్వాలిఫయిర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో పోటీపడాల్సి వస్తుంది. అయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన కేకేఆర్ ఈ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఓడింది. మరోవైపు సన్‌రైజర్స్ మాత్రం అయిదింట్లో పరాజయాన్ని చవిచూసింది. అంతేగాక లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై కోల్‌కతాదే పైచేయి.

KKR vs SRH Four Reasons Why Sunrisers Hyderabad Will Defeat KKR in IPL 2024 Qualifier 1

ఈ గణాంకాలను బట్టి చూస్తే ఇవాళ కేకేఆర్ గెలుస్తుందని ఎక్కువమంది అంచనా వేస్తుంటారు. కానీ క్వాలిఫయిర్‌-1లో కోల్‌కతాపై సన్‌రైజర్స్ విజయం సాధిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తమ అభిప్రాయానికి నాలుగు కారణాలు కూడా వివరిస్తున్నారు. అందులో మొదటి కారణం.. కేకేఆర్ గత పది రోజులుగా మ్యాచ్‌లు ఆడలేకపోవడం అని చెబుతున్నారు.

కోల్‌కతా జట్టు ఆడాల్సిన గత రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మే 11న చివరిగా ఆడిన మ్యాచ్‌ కూడా వరుణుడి రాకతో 16 ఓవర్లకే కుదించారు. ఈ మ్యాచ్‌లో ముంబైపై కేకేఆర్ గెలిచింది. కానీ ఆ తర్వాత జట్టుగా ఆటగాళ్లంతా కలిసి బరిలోకి దిగలేకపోయారు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ మాత్రం జోరు మీదుంది. పంజాబ్ కింగ్స్‌పై 215 పరుగుల లక్ష్యాన్ని గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక రెండో కారణం.. సన్‌రైజర్స్ డేంజర్ బ్యాటింగ్ లైనప్.

ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్‌హెచ్‌దే. అభిషేక్, ట్రావిస్ హెడ్ కుదురుకుంటే రికార్డుల బద్దలవ్వడం సాధారణంగా మారింది. వారిద్దరిలో ఒకరు వెంటనే ఔటైనా అదే జోరును కొనసాగించడానికి తాజాగా జట్టులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. హెన్రిచ్ క్లాసెన్, మార్క్‌రమ్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్‌తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది.

ఇక మూడో కారణం.. కేకేఆర్ పేసర్ల కంటే సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్లే అనుభవజ్ఞులు. బౌండరీలు దూరంగా ఉండే అహ్మదాబాద్ మైదానంలో ఎస్‌ఆర్‌హెస్ పేసర్లలో హిట్టింగ్ చేయడం కోల్‌కతా బ్యాటర్లకు సవాలే. అంతేగాక అహ్మదాబాద్ పరిస్థితులు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బాగా తెలుసు. నాకౌట్ మ్యాచ్‌ల్లో జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతనికి బాగా తెలుసు. మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు.నాలుగో కారణం.. ఫిల్ సాల్ట్ దూరమవ్వడం. కోల్‌కతా సాధించిన విజయాల్లో సాల్ట్‌ది కీలకపాత్ర. అతను కీలక సమయంలో దూరమవ్వడం జట్టుకు ప్రతికూలాంశమే.

Story first published: Tuesday, May 21, 2024, 11:27 [IST]
Other articles published on May 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+