ఐపీఎల్-2024 సీజన్‌లో తుది పోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇవాళ అమీతుమీ తేల్చుకోనున్నాయి. బలాబలాల్లో సమవుజ్జీలుగా నిలిచిన ఇరు జట్లు ఫైనల్‌లో ఫేవరేటే. ఈ నేపథ్యంలో చెపాక్ వేదికగా జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే గణాంకాల పరంగా చూస్తే సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌దే పైచేయి. ఈ సీజన్‌లోనే కాదు, ఐపీఎల్‌లో ఓవరాల్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌పై కోల్‌కతా మెరుగైన రికార్డు సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండింట్లోనూ కోల్‌కతాదే విజయం. సన్‌రైజర్స్‌పై లీగ్ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో, క్వాలిఫయిర్-1లో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్ నెగ్గింది.

ఇక ఐపీఎల్‌లో ఓవరాల్‌గా ఇరు జట్లు 27 మ్యాచ్‌లు ఆడగా మూడింట రెండో వంతు కోల్‌కతానే నెగ్గింది. సన్‌రైజర్స్ తొమ్మిదింట్లోనే గెలిస్తే, కేకేఆర్ 18 మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించింది. ఈ లెక్కలు చూస్తే ఇవాళ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం ఖాయమనిపిస్తుంటుంది. కానీ ఫైనల్ పోరు అంటే అంత ఈజీకాదు. ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఆదిలోనే వికెట్లు కోల్పోయినా, ఛేదనలో కావాల్సిన రన్‌రేటు అధికంగా ఉన్నా ఒత్తిడికి చిత్తువుతుంటారు.
నాకౌట్స్‌లో జట్టును విజయతీరాలకు చేర్చడంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు అపారమైన అనుభవం ఉంది.వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కమిన్స్ తమ జట్టును గెలిపించకున్నాడు. ఇవాళ కూడా అదే జోరు ప్రదర్శించి కేకేఆర్‌పై విజయం సాధించాలని భావిస్తున్నాడు. అయితే ఫైనల్ కోసం కమిన్స్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ట్రోఫీతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ట్రోఫీకి ఎడమవైపు కమిన్స్ నిలబడటంతో సన్‌రైజర్స్ జట్టే విజేతగా నిలుస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తున్నాయి. గత వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇచ్చిన ఫొటో షూట్‌లో కమిన్స్ ఎడమవైపు నిలబడ్డాడు. మరోవైపు కుడివైపున నిలబడిన రోహిత్ జట్టును గెలిపించలేకపోయాడు. ఐపీఎల్ ఫైనల్‌లోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.