KKR vs SRH Dream11 Prediction: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! రికార్డ్స్, తుది జట్లు ఇవే!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ఈరోజు డబుల్ ధమాకాలో భాగంగా రెండో మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంనుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుండి బయటపడింది.
మరోవైపు కోల్‌కతాకు ప్రతి మ్యాచ్ ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితి. కోల్‌కతా 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే.. ఆ కోల్‌కతా హైదరాబాద్‌తో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ కోల్‌కతా ఈ మ్యాచ్ ఓడితే.. ప్లే ఆఫ్ సన్నగిల్లుతాయి.

రికార్డ్స్
ఈ సీజన్‌లో జరుగుతోన్న 49వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య దుబాయ్ మైదానంలో జరగనుంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా కోల్‌కతా, సన్‌రైజర్స్ జట్లు 20 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 13 సార్లు గెలుపొందగా.. సన్‌రైజర్స్ 7 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో కోల్‌కతా, సన్‌రైజర్స్ తలపడిన మ్యాచులో మోర్గాన్ సేన విజయం సాదించింది.
ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో మూడు కోల్‌కతా, రెండు సన్‌రైజర్స్ గెలిచింది. ఈ వికెట్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 160. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. ఇక్కడ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. దుబాయ్ మైదానం పెద్దది కాబట్టి భారీ స్కోర్ నమోదు కావడం అసాధ్యమే. బౌండరీలు కూడా కాస్త కష్టంగా ఉంటుంది.

రేసు నుంచి నిష్క్రమించినా
ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో యువ ఓపెవర్ వెంకటేశ్ అయ్యర్ మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. రెండో దశలో మొదటి రెండు మ్యాచుల్లో అదరగొట్టాడు. ఆ తర్వాత మాత్రం విఫలయినా.. గత మ్యాచులో చెలరేగాడు. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మాత్రం అంచనాలను అందుకోవట్లేదు. రాహుల్ త్రిపాఠి బ్యాట్ జుళిపిస్తున్నాడు. త్రిపాఠితో పాటు నితీశ్ రానా, కెప్టెన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడిచేస్తున్నారు. టీమ్ సౌథీ, లుకీ ఫెర్గుసన్, సందీప్ వారియర్ రాణించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినా.. ఈ మ్యాచ్ గెలిచి పరువుకాపాడుకోవాలని చూస్తోంది. రాయ్, కేన్, అభిషేక్, అబ్దుల్, రషీద్ సత్తాచాటాలని చూస్తున్నారు.

తుది జట్లు (అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), నితీశ్ రానా, దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, లుకీ ఫెర్గుసన్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి..
సన్‌రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్.

డ్రీమ్ 11 టీమ్
విద్ధిమాన్ సాహా (కీపర్), రాహుల్ త్రిపాఠి, జాసన్ రాయ్, కేన్ విలియమ్సన్, నితీష్ రాణా, వెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), జాసన్ హోల్డర్ (వైస్ కెప్టెన్), సునీల్ నరైన్, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, సిద్ధార్థ్ కౌల్

జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్, గుర్కీరత్ సింగ్ మన్, కరుణ్ నాయర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, శుభమాన్ గిల్, హర్భజన్ సింగ్, కమలేష్ నాగరకోటి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, పవన్ నేగి, ప్రనంద్ కృష్ణ, సందీప్ వారియర్, శివమ్ దుబే, టిమ్ సౌతీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్, బెన్ కట్టింగ్, షకీబ్ అల్ హసన్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, షెల్డన్ జాక్సన్, టిమ్ సీఫర్ట్
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్ గోస్వామి, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, ఉర్మాన్ మాలిక్, బాసిల్ థాంప్ , సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, అబ్దుల్ సమద్, J సుచిత్, జాసన్ హోల్డర్, విరాట్ సింగ్, ప్రియం గార్గ్, కేదార్ జాదవ్, ముజీబ్-ఉర్-రహమాన్, జాసన్ రాయ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications