
ఫుల్ జోష్‌లో హర్షల్ పటేల్
అసలు ఏ జరిగిందంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ 15 ఓవర్లకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్‌కు చేరువలో ఉంది. ఆ సమయంలో 16వ ఓవర్‌ను హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే రెండు వికెట్లు తీసిన హర్షాల్ పటేల్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇక ఆ ఓవర్ చివరి బంతిని 11వ నంబర్ బ్యాటర్ వరుణ్ చక్రవర్తి ఎదుర్కొన్నాడు. అయితే ఆ బంతి బ్యాట్‌ను తాకుతూ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చేతుల్లో వెళ్లి పడింది.

బ్యాట్‌కు తగిలిన బంతి
కానీ ఆ బంతికి బ్యాట్ తగలకుండా ప్యాడ్లను తాకిందని భావించిన హర్షల్ పటేల్ ఔట్‌గా అంపైర్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ నుంచి ఎటువంటి చలనం లేదు. దీంతో డీఆర్ఎస్ తీసుకోవాల్సిందిగా వెంటనే కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్‌ను హర్షల్ పేటల్ కోరాడు.
దీనికి వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. ఇక హర్షల్ పటేల్‌ను గుడ్డిగా నమ్మిన డుప్లిసెస్ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. అయితే థర్డ్ అంపైర్ రివ్యూలో బంతి బ్యాట్‌కు తగిలినట్లుగా స్పష్టంగా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.
డుప్లిసెస్‌ను బ్యాన్ చేయాలి
ఈ చెత్త రివ్యూపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొందరైతే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్‌ను ఈ సీజన్ మొత్తానికి బ్యాన్ చేయాలని ట్విట్టర్‌లో రాసుకొస్తున్నారు. ఇంకొందెరేమో క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత చెత్త డీఆర్ఎస్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందెరేమో గతంలో అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా సక్సెస్ అయిన ఫాఫ్ డుప్లిసెస్ వంటి కెప్టెన్ ఇలాంటి చెత్త రివ్యూ తీసుకోవడమేంటని వాపోతున్నారు.
అలాగే ఎంటి డుప్లిసెస్ కళ్లు దొబ్బాయా అని మండిపడుతున్నారు. దానికి కూడా డీఆర్ఎస్ తీసుకోవడంమేంటని ఫైర్ అవుతున్నారు. ఇంకొదరైతే హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను కూడా ఇందులోకి లాగుతున్నారు. సిరాజ్ కూడా హర్షల్ పటేల్ మాదిరిగానే రివ్యూ తీసుకోవాలని కెప్టెన్లపై ఒత్తిడి తెస్తుంటాడు. అందుకే అతడిని క్వారంటైన్ చేయాలని, లేకపోతే ఇలాగే అతనికి ఉన్న జబ్బును అందరికీ అంటిస్తాడని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఆర్సీబీ విజయం
ఇక మ్యాచ్ విషయానికొస్తే లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతానైట్ రైడర్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 128 పరుగులకే ఆటౌటైంది. 129 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లలోని ఏ ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగుల మార్క్‌ను అందుకోకపోవడం గమనార్హం. మొత్తంగా బౌలర్లు అధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్లతో చెలరేగిన ఆర్సీబీ స్పిన్నర్ హసరంగకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications












