
కొంపముంచిన బ్యాటింగ్ వైఫల్యం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది. ఆ జట్టు బ్యాటర్లలో కనీసం ఒక్కరు కూడా 30 పరుగుల మార్క్‌ను అందుకులేకపోయారంటే.. వారి బ్యాటింగ్ ఆర్డర్ ఎంత ఘోరంగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ ప్రారంభమైన నాల్గో ఓవర్లో తొలి బంతికి వెంకటేష్ అయ్యర్ (10)ను ఔట్ చేసి ఆకాష్ దీప్ కేకేఆర్‌ను దెబ్బకొట్టాడు. ఇక ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ రహానే (10)ను సిరాజ్ ఫెమిలియన్ పంపడంతో 32 పరుగులకే కేకేఆర్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

మిడిలార్డర్ అట్లర్ ఫ్లాప్
ఆ తర్వాత ఆదుకుంటుందున్న అనుకున్న కేకేఆర్ మిడిలార్డర్ కూడా దారుణంగా విఫలవడంతో 9 ఓవర్లలోనే 67 పరుగులకే కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఆ జట్టు స్కోర్ 100 పరుగులు కూడా దాటడం కష్టమనిపించింది. ఆ జట్టు బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (13), నితీష్ రానా (10), సునీల్ నరైన్ (12), బిల్లింగ్స్ (14), జాక్సన్ (0) చేతులెత్తేశారు. ఈ క్రమంలో ఆండ్రూ రసెల్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ 25 పరుగులు చేసిన రసెల్‌ను హర్షల్ పటేల్ ఫెమిలియన్ పంపాడు. చివర్లో టేలండర్లు ఉమేష్ యాదవ్ (18), వరుణ్ చక్రవర్తి (10) తలో చేయి వేయడంతో కోల్‌కతా చెప్పుకోదగ్గ స్కోర్ సాధించింది. మొత్తానికి 18.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. హసరంగ, అక్షయ్ దీప్ కోల్‌కతా పతనంలో కీలక పాత్ర పోషించారు. హసరంగ 4, అక్షయ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు.

భాగస్వామ్యాలను విడదీయలేకపోయిన బౌలర్లు
అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఉమేష్ యాదవ్, టీమ్ సౌథీ ఆరంభంలోనే దెబ్బ కొట్టారు. అనుజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (12)ని వరుస ఓవర్లలో ఔట్ చేశారు. కెప్టెన్ డుప్లిసెస్ (5)ను సౌథీ ఔట్ చేయడంతో 17 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. దీంతో కోల్‌కతాకు మ్యాచ్‌పై ఆశలు చిగురించాయి. కానీ డేవిడ్ విల్లీ (18), రూథర్ ఫడ్ (28), షాబాజ్ అహ్మద్ (27) కాస్త రాణించి ఆర్సీబీని మళ్లీ పటిష్ట స్థితిలో ఉంచారు. విల్లీ, రూథర్ ఫడ్ 45 పరుగుల భాగస్వామ్యం, రూథర్ ఫడ్, షాబాజ్ అహ్మద్ 39 పరుగుల భాగస్వామ్యంతో ఆర్సీబీ 101-5తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ భాగస్వామ్యాలను త్వరగా విడదీయలేక పోవడం కూడా కోల్‌కతాకు మైనస్‌గా మారింది.

కార్తీక్‌ను రనౌట్ చేసే అవకాశం మిస్
18.2వ ఓవర్లో దినేష్ కార్తీక్ (14) ను రనౌట్ చేసే అవకాశం రాగా, ఫీల్డింగ్ వైఫల్యంతో కోల్‌కతా ఆ అవకాశాన్ని వినియోగించులేకపోయింది. చివర్లో హర్షల్ పటేల్ (10) కూడా కార్తీక్‌కు సహకరించాడు. దీంతో చివరి ఓవర్లో విజయానికి 7 పరుగులు కావాల్సిన సమయంలో రసెల్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను వరుసగా సిక్సు, ఫోర్ బాది ఆర్సీబీకి దినేష్ కార్తీక్ విజయాన్ని అందించాడు. దీంతో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఒక వేళ దినేష్ కార్తీక్‌ను రనౌట్ చేసి ఉంటే మ్యాచ్ కేకేఆర్ గెలిచే అవకాశాలు ఉండేవి. ఇలా బ్యాటింగ్ వైఫల్యం, కీలక సమయంలో వికెట్ల తీయలేకపోవడం, దినేష్ కార్తీక్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్జడం కేకేఆర్ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications












