Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RCB: సింగిల్ హ్యాండ్‌తో కేకేఆర్‌ వికెట్ కీప‌ర్ సూప‌ర్ క్యాచ్‌.. నెటిజ‌న్లు ఫిదా! వీడియో వైర‌ల్‌

KKR vs RCB: Kolkata Knight Riders wicket keeper Sheldon Jackson super catch.. Video goes viral

బుధవారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీప‌ర్ ప‌ట్టిన ఓ సూప‌ర్ క్యాచ్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. 129 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో 17 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఆదుకున్నాడు. మొద‌ట డేవిడ్ విల్లీతో క‌లిసి 45 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెలకొల్పిన రూథ‌ర్‌ఫోర్డు.. షాబాజ్ అహ్మద్‌తో క‌లిసి 39ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పి జ‌ట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. అయితే అట్టి రూథ‌ర్‌ఫోర్డును కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ వికెట్ కీప‌ర్ షెల్డన్ జాక్సన్ అద్భుత క్యాచ్‌తో ఫెమిలియ‌న్ పంపాడు.

18వ ఓవ‌ర్లో 107-5తో ఆర్సీబీ ప‌టిష్ట స్థితిలో ఉండ‌డంతో ఆ జ‌ట్టు విజ‌యం ఖాయ‌మ‌నిపించింది. కానీ టీమ్ సౌథీ వేసిన 18వ ఓవ‌ర్ రెండో బంతిని రూథ‌ర్‌ఫోర్డు వెన‌క్కి ఆడే ప్ర‌య‌త్నం చేయ‌గా వికెట్ కీప‌ర్ షెల్డన్ జాక్సన్ డైవ్ చేసి మ‌రి ఆ బంతిని సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో 28 ప‌రుగులు చేసిన రూథ‌ర్‌ఫోర్డు ఔట‌య్యాడు. అలాగే కేకేఆర్ మ‌ళ్లీ మ్యాచ్‌లోకి వ‌చ్చింది. ఈ ప్ర‌స్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. రూథ‌ర్‌ఫోర్డు ప‌ట్టిన ఈ సూప‌ర్ క్యాచ్‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

KKR vs RCB: Kolkata Knight Riders wicket keeper Sheldon Jackson super catch.. Video goes viral

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌పై రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు థ్రిల్లింగ్ విక్ట‌రీ సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 128 ప‌రుగుల‌కే ఆటౌటైంది. 129 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ మ‌రో 4 బంతులు మిగిలి ఉండ‌గానే చేధించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తంలో ఇరు జ‌ట్ల‌లోని ఏ ఒక్క ఆట‌గాడు కూడా క‌నీసం 30 ప‌రుగుల మార్క్‌ను అందుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా బౌల‌ర్లు అధిప‌త్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల‌తో చెల‌రేగిన ఆర్సీబీ స్పిన్న‌ర్ హ‌స‌రంగకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

Story first published: Thursday, March 31, 2022, 10:20 [IST]
Other articles published on Mar 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+