Gautam Gambhir ఏం దరిద్రపు నోరయ్యా నీది.. సిక్స్‌లన్నావ్! గోల్డెన్ డకౌటయ్యాడు! పేలుతున్న సెటైర్స్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై ట్విటర్ వేదికగా తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులు గంభీర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్లతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పేలవ బ్యాటింగ్‌కు తోడు పసలేని బౌలింగ్‌తో కనీస పోరాటపటిమ చూపించలేదు. అయితే ఈ మ్యాచ్‌ నేపథ్యంలో కేకేఆర్ మాజీ కెప్టెన్ అయినటువంటి గౌతమ్ గంభీర్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

గంభీర్ అంచనా రివర్స్..

స్టార్ స్పోర్ట్స్ ‘గేమ్ ప్లాన్' షోలో పాల్గొన్న గంభీర్.. ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్ గురించి తన అంచనాలను వెల్లడించాడు. కోల్‌కతాపై విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌కు మంచి రికార్డు ఉందని, అతనే ఈ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదుతాడని చెప్పుకొచ్చాడు. తీరా మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆండ్రీ రస్సెల్ వేసిన పదునైన యార్కర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ డివిలియర్స్‌ ఫస్టాఫ్ లీగ్ మాదిరి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడుతారని ఆర్‌సీబీ అభిమానులు భావించారు. కానీ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రస్సెల్ వేసిన యార్కర్.. ఏబీడీ లెగ్ సైడ్ పాదాల వద్ద పడింది.

డివిలియర్స్ డకౌట్..

ఆ బంతిని కొద్దిపాటి మూమెంట్‌తో లెగ్‌సైడ్ హిట్ చేసేందుకు డివిలియర్స్ ప్రయత్నించాడు. కానీ బ్యాట్‌కు దొరకని బంతి పాదానికి తాకి.. నేరుగా వెళ్లి స్టంప్‌లను గీరాటేసింది. ఈ వికెట్‌తో కోల్‌కతా ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వాస్తవానికి లెగ్ సైడ్ వేసే బంతుల్ని ఏబీడీ అలవోకగా స్టాండ్స్‌లోకి పంపిస్తాడు. తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్ లేకపోవడం, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలం కావడంతో మిస్టర్ 360 ఆ టచ్ కోల్పోయినట్లు కనిపించింది. ఐపీఎల్‌లో డివిలియర్స్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇది ఆరోసారి కాగా టోర్నీలో ఇప్పటి వరకూ 10 సార్లు అతను డకౌటయ్యాడు.

దరిద్రపు నోరు..

ఇక ఏబీడీ డకౌటవ్వడానికి గంభీరే కారణమని ఆరోపిస్తూ.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ‘గంభీర్ ఏం దరిద్రపు నోరయ్యా నీది.. సిక్స్‌లన్నావ్.. గోల్డెన్ డౌకటయ్యాడు.'అని కామెంట్ చేస్తున్నారు. కోల్‌కతాకు వీడ్కోలు పలికినా గంభీర్ ఆ జట్టు తరఫున ఆడుతూనే ఉన్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. గంభీర్ అంచనాలు ఏవి నిజం కావని, గతంలో చాలాసార్లు ఈ విషయం నిరూపితమైందని పేర్కొంటున్నారు. ఈ సెటైర్లు ఫన్నీ మీమ్స్‌తో ప్రస్తుతం గంభీర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

దుమ్మురేపిన కేకేఆర్

దుమ్మురేపిన కేకేఆర్

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19 ఓవర్లలో 92 రన్స్‌కు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/13), ఆండ్రీ రస్సెల్(3/9) బెంగళూరు పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్ రెండు, ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తీశారు. అనంతరం కోల్‌‌కతా 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 రన్స్ చేసి ఘన విజయాన్నందుకుంది. చిన్న టార్గెట్‌ను ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 48), అరంగేట్ర ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41 నాటౌట్) నింపాదిగా ఛేదించారు. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌కు ఓ వికెట్ దక్కింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 21, 2021, 13:26 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X