Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: దిశా పటానీ హాట్ డ్యాన్స్ - కళ్లు చెదిరే రెమ్యునరేషన్!!

IPL 2025 Disha Patani: ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కలిసి స్టేజ్ పై స్టెప్పులు కూడా వేశారు. మరోవైపు ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తన స్వరంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయగా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అండ్ బోల్డ్ స్టెప్పులతో అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించింది.

ఫ్యాన్స్ అసంతృప్తి..
అయితే శ్రేయా ఘోషల్.. హిందీ పాటలతో పాటు పుష్ప-2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ పాటను తెలుగులో ఆలపించి అభిమానులను బాగానే ఆకట్టుకుంది. కానీ దిశా పటానీ డ్యాన్స్ మాత్రం కొంతమంది ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. అందుకు కారణం.. ఆమె డ్రెస్ తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ మరింత బోల్డ్ గా ఉండటమే అని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. పైగా దిశా పటానీ వేసిన హాట్ స్టెప్పులకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా కాసేపు ఆమె ప్రదర్శనను కట్ కూడా చేశారు. కెమెరాను ఇతర కార్యక్రమాలకుపైకి మళ్లించి కవర్ చేశారు. దీంతో యాత్ ఆడియెన్స్ కాస్త నిరుత్సాహపడ్డారు. దిశా పటానీ పెర్ఫామెన్స్ పూర్తిగా ఎందుకు చూపించలేదని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది దిశా డ్యాన్స్ బాలేదని అందుకే చూపించలేదని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

జీరో ఎనర్జీ, జీరో పెర్ఫామెన్స్...
'జీరో ఎనర్జీ, జీరో పెర్ఫామెన్స్. చెత్త ఐపీఎల్ సెర్మనీ', 'దిశా పటానీ డ్యాన్స్ బాలేదు, థ్యాంక్యూ స్టార్ స్పోర్ట్స్ దిశా పటానీ వీడియోను కట్ చేసినందుకు', 'హాట్ హాట్ గా దిశా పటానీ డ్యాన్స్.. మధ్యలోనే ఎందుకు ఆపేశారు.. నేను నిరుత్సాహపడ్డాను', 'నాకు దిశా పటానీ డ్యాన్స్ కావాలి' అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

దిశా పటానీ రెమ్యునరేషన్..
అయితే దిశా పటానీ ప్రదర్శన విషయం పక్కపెడితే.. ఆమె ఈ బోల్డ్ డ్యాన్స్ కోసం బానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు రూ.కోటి వరకు ఛార్జ్ చేసినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. కానీ ఇది అఫీషియల్ లెక్క కాదు.

KKR VS RCB Disha patani remuneration charges 1 crore for IPL 2025 Opening Ceremony
Photo Credit: twitter screenshot
Story first published: Saturday, March 22, 2025, 21:14 [IST]
Other articles published on Mar 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+