Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS: దుమ్మ‌లేపిన‌ ఉమేష్.. చివ‌ర్లో ర‌బాడ మెరుపులు.. కేకేఆర్ ముందు సింపుల్ టార్గెట్‌

KKR vs PBKS: Umesh yadav taken 4 wickets and Punjab kings all out Just 137 runs

పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ బౌల‌ర్లు వ‌ణికించారు. ఆరంభం నుంచే వ‌రుస‌గా వికెట్లు తీయడంతో ఏ ద‌శలోనూ పంజాబ్ మంచి స్కోర్ సాధించేలా క‌నిపించ‌లేదు. కోల్‌క‌తా బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ 4 వికెట్ల‌తో పంజాబ్ న‌డ్డి విరిచాడు. అత‌నికి టిమ్ సౌథీతోపాటు మిగ‌తా బౌల‌ర్లు కూడా స‌హ‌క‌రించారు. భాగ‌స్వామ్యాలు నెల‌కొల్ప‌లేక‌పోవ‌డం ఆ జ‌ట్టు కొంప‌ముంచింది. చివ‌ర్లో క‌గిసో ర‌బాడ కాస్త మెరుపులు మెరిపించ‌డంతో పంజాబ్ చెప్పుకోద‌గ్గ స్కోర్ సాధించింది. మొత్తంగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు 138 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఉంచింది.

దెబ్బ కొట్టిన ఉమేష్ యాద‌వ్‌

దెబ్బ కొట్టిన ఉమేష్ యాద‌వ్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ ఆరంభంలోనే దెబ్బ‌కొట్టాడు. తొలి ఓవ‌ర్లోనే పంజాబ్ కెప్టెన్ మాయాంక్ అగ‌ర్వాల్‌ను ఒక్క ప‌రుగుకే ఔట్ చేశాడు. దీంతో ఆ జట్టు 2 ప‌రుగుల‌కే తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్, భానుక రాజ‌ప‌క్సేతో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. రాజ‌పక్సే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.

రాజ‌ప‌క్సే హ్యాట్రిక సిక్స‌ర్లు

రాజ‌ప‌క్సే హ్యాట్రిక సిక్స‌ర్లు

ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ‌రీ బాదిన రాజ‌పక్సే శివ‌మ్ మావి వేసిన నాల్గో ఓవ‌ర్‌లో చెల‌రేగాడు. ఆ ఓవ‌ర్లో హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో దుమ్ములేపాడు. 4, 6 ,6, 6 తో అద‌ర‌గొట్టాడు. కానీ ఆ త‌ర్వాతి బంతికే అంటే ఆ ఓవ‌ర్ ఐదో బంతికి భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి రాజ‌ప‌క్సే ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో 9 బంతుల్లోనే 31 ప‌రుగులు బాదాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాడు. ఆ కాసేప‌టికే ఆరో ఓవ‌ర్లో శిఖ‌ర్ ధావ‌న్ (16)ను సౌథీ ఫెమిలియ‌న్ చేర్చాడు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 62 ప‌రుగులు చేసింది.

 మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యం

మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యం

మిడిలార్డ‌ర్ కూడా విఫ‌ల‌మ‌వ‌డంతో 10 ఓవ‌ర్లు ముగిసే స‌మయానికే పంజాబ్ జ‌ట్టు స‌గం వికెట్లు కోల్పోయింది. లివింగ్‌స్టోన్ (19)ను ఉమేష్ యాద‌వ్‌, రాజ్ బ‌వా (11)ను న‌రైన్ ఔట్ చేయడంతో 9.3 ఓవ‌ర్ల‌లో పంజాబ్ 84 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయింది. షారూక్ ఖాన్‌ను సౌథీ డ‌కౌట్ చేయ‌గా.. హర్‌ప్రీత్ బ్రార్ (14)ను ఉమేష్ యాద‌వ్ ఔట్ చేశాడు. ఆ వెంట‌నే రాహుల్ చాహ‌ర్‌ను కూడా ఉమేష్ డ‌కౌట్ చేశాడు. దీంతో పంజాబ్ 14.4 ఓవ‌ర్ల‌లో 102 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయింది.

ర‌బాడ మెరుపులు

ర‌బాడ మెరుపులు

ఈ స‌మ‌యంలో ప‌దో నంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన క‌గిసో ర‌బాడ కాసేపు మెరుపులు మెరిపించాడు. 4 ఫోర్లు, ఒక సిక్సుతో 16 బంతుల్లోనే 25 ప‌రుగులు బాది పంజాబ్ స్కోర్‌ను 130 ప‌రుగులు దాటించాడు. ఈ క్ర‌మంలో ర‌సూల్ బౌలింగ్‌లో భారీ షాట్ ప్ర‌య‌త్నించ‌గా.. సౌథీ అద్భుతంగా దాన్ని ర‌న్నింగ్స్ క్యాచ్ అందుకున్నాడు. ఆ త‌ర్వాతి బంతికే ఆర్ష్‌దీప్ సింగ్ ర‌నౌట్ కావ‌డంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.2 ఓవ‌ర్ల‌లో పంజాబ్ 137 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ఉమేష్ యాద‌వ్ 4, టిమ్ సౌథీ 2, శివ‌మ్ మావి, సునీల్ న‌రైన్, ర‌సెల్ త‌లో వికెట్ తీశారు.

Story first published: Friday, April 1, 2022, 21:34 [IST]
Other articles published on Apr 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+