Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS Toss Update: టాస్ గెలిచిన కోల్‌క‌తా.. ఒక్కో మార్పుతో బ‌రిలోకి ఇరు జ‌ట్లు

KKR vs PBKS Toss Update: Kolkata Knight Riders won the toss and elected to bowl first

వాంఖడే: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. కాగా ఐపీఎల్ 2022లో ఇరు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కో మ్యాచ్ చొప్పున గెలిచాయి. ఇరు జ‌ట్లు ఈ మ్యాచ్‌లో ఒక్కో మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ మాట్లాడుతూ ''మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. సాయంత్రం వేళల్లో మంచు ఉంటుంది. నేను చివరి గేమ్‌లో చెప్పినట్లు, బోర్డులో ఎంత స్కోర్‌ ఉన్నా డిఫెన్స్ చేసుకోవ‌డం ముఖ్యం. మా ఆటగాళ్లందరూ అంకితభావంతో ఉన్నారు. మ్యాచ్‌లో తమ తమ పాత్రలను నిర్వహించండ‌పై దృష్టి సారించారు.ఈ మ్యాచ్‌లో మేము ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాం. షెల్డ‌న్ జాక్స‌న్ స్థానంలో శివ‌మ్ మావి ఆడునున్నాడు.'' అని చెప్పాడు.

ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ ''మేము ఇన్నింగ్స్‌ను బాగా ప్రారంభించాలి. పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలి. బాగా బ్యాటింగ్ చేయాలి. మేము సరైన వైఖరి, సరైన శక్తితో ఆడాలని చూస్తున్నాము. అలా మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ఈ మ్యాచ్‌లో మేము ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాం. సందీప్ స్థానంలో క‌గిసో ర‌బాడ ఆడ‌నున్నాడు.'' అని చెప్పాడు.

KKR vs PBKS Toss Update: Kolkata Knight Riders won the toss and elected to bowl first

తుది జ‌ట్లు:
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స (వికెట్ కీప‌ర్), షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీప‌ర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

Story first published: Friday, April 1, 2022, 19:21 [IST]
Other articles published on Apr 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+