నా హార్ట్ బీట్ పెరిగిపోయింది.. ఇలాంటివి తట్టుకోలేను ప్లీజ్..!: రికీ పాంటింగ్
Ricky Ponting: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భత విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. అయితే ఈ విజయంపై పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వయసులో తనకు ఇలాంటి మ్యాచులు చూడాల్సిన అవసరం లేదని అన్నాడు.
100 శాతం పక్కా...
"నా హార్ట్ రేట్ (హృదయ స్పందన) చాలా పెరిగింది. నాకు ఇప్పుడు 50 ఏళ్లు వచ్చాయి. ఈ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదు. 112 పరుగుల లక్ష్యాన్ని 16 పరుగులు తేడాతో కాపాడుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి స్వల్ప లక్ష్య ఛేదనలు సగం మ్యాచ్ అయ్యాక చాలా కష్టంగా మారతుందని, మా జట్టు సభ్యులకు చెప్పాను. పిచ్ కష్టంగానే ఉంది. గేమ్ మొత్తం చూస్తే ఇది అర్థమవుతుంది. బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే చాహల్‌కు గత మ్యాచ్‌లో భుజానికి గాయం అవ్వడంతో ఈ మ్యాచ్‌కు ముందు ఫిట్‌నెస్ టెస్టు చేశారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడిని పక్కకు పిలిచి కళ్లలోకి చూస్తూ.. నువ్వు ఫిట్‌గానే ఉన్నావా అని అడిగాను. అప్పుడతడు 100 శాతం బాగానే ఉన్నానని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ ప్రదర్శన అద్భుతం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో మేం ఓడిపోయినా.. సెకండ్ హాఫ్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శన చూసి పొగడకుండా ఉండలేను. వారు అద్భుతంగా ఆడారు."
చెత్తగా ఉంది...
"కానీ మా బ్యాటింగ్ చాలా చెత్తగా ఉంది. షాట్‌ల సెలక్షన్, ప్లాన్ అమలు చేసిన విధానం బాలేదు. కానీ మా ఆటగాళ్లు ఫీల్డింగ్‌కు వచ్చాక నాకు ఉపశమనం కలిగింది. వికెట్లు తొందరగా తీశారు. ఈ మ్యాచ్ ప్రతిఒక్కరూ చూడాలి. ఎందుకంటే మ్యాచ్‌పై ఎలా నమ్మకం కలిగి ఉండాలో తెలుస్తుంది. ఒకవేళ విజయం దగ్గరి వరకు వచ్చి ఓడిపోతే, సీజన్‌లో అదే డిఫైనింగ్ మమెంట్ అవుతుందని, ఆటగాళ్లకు ఎప్పుడూ చెబుతుంటాను. ఇప్పుడు అదే జరిగింది. మ్యాచ్ సగం పూర్తవ్వగానే.. ప్రపంచంలోని చాలా మంది గెలుస్తామో లేదో అని అనుమానంగా ఉంటారు. కానీ మా ప్లేయర్లు సాధించారు. మా వాళ్లకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఈ రాత్రి అద్భుతం చేశారు. ఇలాంటి విజయాలు ఎప్పుడూ చాలా స్వీట్ గా ఉంటాయి. ఐపీఎల్‌లో నేను చాలా మ్యాచ్‌లకు కోచ్‌గా వ్యవహరించాను. అయితే ఈ విజయం మాత్రం నాకు ఎప్పుడూ ది బెస్ట్ గా నిలిచిపోతుంది." అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications