Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS: 32 మీట‌ర్లు ప‌రిగెత్తి మ‌రి టిమ్ సౌథీ సూప‌ర్ క్యాచ్‌.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

KKR vs PBKS: Kolkata Knight Riders player Tim Southee 32 meters running catch goes viral

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఫీల్డ‌ర్ టిమ్ సౌథీ ప‌ట్టిన ఓ సూప‌ర్ క్యాచ్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ర‌న్నింగ్‌లో డైవ్ చేస్తూ ప‌ట్టిన ఆ క్యాచ్ వారెవ్వా అనిపించింది. అటు ఆ క్యాచ్‌తో అప్ప‌టివ‌ర‌కు దూకుడుగా ఆడిన ర‌బాడ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. అంతేకాకుండా ఆ త‌ర్వాతి బంతికే పంజాబ్ కూడా ఆలౌలైంది.

32 మీట‌ర్లు ప‌రిగెత్తి సూప‌ర్ క్యాచ్‌

ఆండ్రూ ర‌సెల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్ తొలి బంతిని అప్ప‌టికే ఊపు మీదున్న క‌గిసో రబాడ భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని ర‌బాడ ఆకాశంలోకి లేపాడు. అయితే బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ సౌథీ ఆ బంతిని అనుస‌రిస్తూ ప‌రిగెత్తుకుంటూ వచ్చాడు. వేగంగా ప‌రిగెత్తుకుంటూ డైవ్ చేసి మ‌రి భారీ ఎత్తు నుంచి వచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా ప‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో 32 మీట‌ర్లు ప‌రిగెత్తిన బంతి చేతిలో ప‌డ్డాక కింద ప‌డ‌కుండా గ‌ట్టిగా పట్టుకుని నేల మీద ప‌డిపోయాడు. సౌథీ సూప‌ర్ క్యాచ్‌కు అత‌డిని స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తోపాటు మైదానంలోని ప్రేక్ష‌కులు చ‌ప్ప‌ట్ల‌తో అభినందించారు. నెటిజ‌న్లు సైతం సౌథీ అద్భుత ఫీల్డింగ్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

 137కే ఆలౌట్

137కే ఆలౌట్

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వైఫ‌ల్యంతో 137 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ ఆరంభంలోనే దెబ్బ‌కొట్టాడు. తొలి ఓవ‌ర్లోనే పంజాబ్ కెప్టెన్ మాయాంక్ అగ‌ర్వాల్‌ను ఒక్క ప‌రుగుకే ఔట్ చేశాడు. దీంతో ఆ జట్టు 2 ప‌రుగుల‌కే తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్, భానుక రాజ‌ప‌క్సేతో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు.

 రాజ‌ప‌క్సే హ్యాట్రిక సిక్స‌ర్లు

రాజ‌ప‌క్సే హ్యాట్రిక సిక్స‌ర్లు

శివ‌మ్ మావి వేసిన నాల్గో ఓవ‌ర్‌లో రాజ‌ప‌క్సే హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో దుమ్ములేపాడు. 4, 6 ,6, 6 తో అద‌ర‌గొట్టాడు. కానీ ఆ త‌ర్వాతి బంతికే అంటే ఆ ఓవ‌ర్ ఐదో బంతికి భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి రాజ‌ప‌క్సే ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో 9 బంతుల్లోనే 31 ప‌రుగులు బాదాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాడు. ఆ కాసేప‌టికే ఆరో ఓవ‌ర్లో శిఖ‌ర్ ధావ‌న్ (16)ను సౌథీ ఫెమిలియ‌న్ చేర్చాడు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 62 ప‌రుగులు చేసింది.

చేతులెత్తేసిన మిడిలార్డ‌ర్‌

చేతులెత్తేసిన మిడిలార్డ‌ర్‌

మిడిలార్డ‌ర్ కూడా విఫ‌ల‌మ‌వ‌డంతో 10 ఓవ‌ర్లు ముగిసే స‌మయానికే పంజాబ్ జ‌ట్టు స‌గం వికెట్లు కోల్పోయింది. లివింగ్‌స్టోన్ (19)ను ఉమేష్ యాద‌వ్‌, రాజ్ బ‌వా (11)ను న‌రైన్ ఔట్ చేయడంతో 9.3 ఓవ‌ర్ల‌లో పంజాబ్ 84 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయింది. షారూక్ ఖాన్‌ను సౌథీ డ‌కౌట్ చేయ‌గా.. హర్‌ప్రీత్ బ్రార్ (14)ను ఉమేష్ యాద‌వ్ ఔట్ చేశాడు. ఆ వెంట‌నే రాహుల్ చాహ‌ర్‌ను కూడా ఉమేష్ డ‌కౌట్ చేశాడు. దీంతో పంజాబ్ 14.4 ఓవ‌ర్ల‌లో 102 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయింది.

మెరిసిన ర‌బాడ‌

మెరిసిన ర‌బాడ‌

చివ‌ర్లో ర‌బాడ 25 ప‌రుగుల‌తో మెర‌వంతో పంజాబ్ స్కోర్ 130 ప‌రుగులు దాటింది. ఈ క్ర‌మంలో ర‌సూల్ బౌలింగ్‌లో భారీ షాట్ ప్ర‌య‌త్నించ‌గా.. సౌథీ అద్భుతంగా దాన్ని ర‌న్నింగ్స్ క్యాచ్ అందుకున్నాడు. ఆ త‌ర్వాతి బంతికే ఆర్ష్‌దీప్ సింగ్ ర‌నౌట్ కావ‌డంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.2 ఓవ‌ర్ల‌లో పంజాబ్ 137 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ఉమేష్ యాద‌వ్ 4, టిమ్ సౌథీ 2, శివ‌మ్ మావి, సునీల్ న‌రైన్, ర‌సెల్ త‌లో వికెట్ తీశారు.

Story first published: Friday, April 1, 2022, 23:11 [IST]
Other articles published on Apr 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+