Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS: తుది జట్టులోకి ఆ నలుగురు - ఇక దబిడి దిబిడే!

KKR vs PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా మరో కీలక మ్యాచుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగి ఆశించిన స్థాయిలో రాణించలేక పాయింట్ల పట్టికలో వెనుకబడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. గత 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన పంజాబ్‌ కింగ్స్‌తో తలపడుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఇది 44వ మ్యాచ్. ఈ మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్ కు దిగింది. ఈ పోరులో రెండు జట్లు.. చెరో రెండు మార్పులతో బరిలోకి దిగాయి.

"మేమే ముందు బ్యాటింగ్ చేస్తాం. మా రెండు జట్లు.. ఇదే పిచ్ పై ఆడాయి. అయితే పిచ్ పై కొన్ని క్రాక్స్ కనిపిస్తున్నాయి, పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి అభిమానుల ముందు ఆడటం ఎప్పుడూ గొప్ప అనుభూతి. ఇక్కడికి వచ్చి మళ్లీ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మాకు ఆరంభాలు బాగా వస్తున్నాయి. మా వంతుగా ఉత్తమంగా ఆడేందుకు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మేం చర్చించుకుంటున్నాం. మనపై మనకు విశ్వాసం ఉండాలి. బౌలర్లు వికెట్లు తీయాలని నేను కోరుకుంటున్నాను. అది మ్యాచ్‌ మోమెంటమ్‌ను మార్చేస్తుంది. పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీస్తే, మిగతా బౌలర్లకు అవకాశాలు వస్తాయి. మాక్స్‌వెల్, ఓమర్‌జై జట్టులోకి వచ్చారు." అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. ఇక కేకేర్ జట్టులోకి పోవెల్, సకారియా జట్టులోకి వచ్చారు.

KKR vs PBKS IPL 2025 Punjab Kings won toss agaisnt Kolkata Knight Riders

"మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యం. టార్గెట్ ఎంత ఉన్నా చేధించాలి. మన బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్లు చాలా మెరుగయ్యారు. బ్యాటింగ్ విషయంలో మా వాళ్లు కాస్త నిరాశపరిచారు. కానీ ఈ ఫార్మాట్‌లో ధైర్యంగా ఆడాల్సిందే. ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ యూనిట్ బాగా రాణించాల్సిన అవసరం ఉంది. మేము కొన్ని సందర్భాల్లో మంచి క్రికెట్ ఆడుతున్నాం. వర్తమానంలో ఉంటూ సానుకూల దృక్పథంతో ముందుగా వెళ్లాలి. మొయిన్‌కు బదులుగా పొవెల్ జట్టులోకి వచ్చాడు. రమన్‌దీప్‌కి బదులుగా సకారియా జట్టులోకి వచ్చాడు." అని రహానె పేర్కొన్నాడు.

తుది జ్టటు ఇదే...
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, అండ్రూ రస్సెల్, రోవ్మాన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ల, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Saturday, April 26, 2025, 19:18 [IST]
Other articles published on Apr 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+