Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR VS PBKS: ఓ పాజీ ఊచకోత కోశారు.. ఊపిరాడనివ్వలేదు!

KKR VS PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరుగుతోన్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. మిగతా బ్యాట్లర్లు ఇంకాస్త బాగా ఆడి ఉండాల్సింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ ఫినిషింగ్ అంతగా బాలేదు. ఇంకాస్త మంచిగా ఆడి ఉంటే.. 220 వరకు స్కోరు వెళ్లేది.

ఇద్దరూ ఊదేశారు..
ఈ మ్యాచులో మొదటగా టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కేకేఆర్ బౌలర్లకు పంజాబ్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 69 పరుగులు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 83 రన్స్) అటాకింగ్ షాట్లు ఆడుతూ మంచి శుభారంభం అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 120 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

బౌండరీలతో విరుచుకుపడుతూ..
ఈ ఇద్దరూ 197, 169 స్ట్రైక్ రేటుతో విరుచుకుపడ్డారు. గ్యాప్ లేకుండా బౌండరీలు బాదారు. అయితే వీరిద్దరిని ఆండ్రూ రస్సెల్ విడగొట్టాడు. ప్రియాంశ్ ఆర్యను పెవిలియన్ పంపాడు. అలానే సెంచరీకు దగ్గరగా వచ్చిన ప్రభ్‌సిమ్రన్‌ను వైభవ్ అరోరా ఔట్ చేశాడు.

కెప్టెన్ నాటౌట్..
ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్ వెల్ (7) మళ్లీ నిరాశపరిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్), మార్కో జాన్సన్ (3), జోస్ ఇంగ్లీష్ (11) పరుగులు చేశారు.కేకేఆర్ డెత్ ఓవర్లు బాగా వేసింది. లాస్ట్ రెండు ఓవర్లు యండ్రూ రసెల్ మంచిగా వేశాడు. తక్కువ పరుగులే ఇచ్చాడు. వైభవ్ అరోరా 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, యాండ్రూ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

KKR VS PBKS IPL 2025 Priyansh Arya Prabhsimran singh Half century sets KKR target 202 runs
Story first published: Saturday, April 26, 2025, 21:27 [IST]
Other articles published on Apr 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+