yuzvendra chahal: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించడానికి కారణం చాహల్ అసాధారణమైన బౌలింగ్. యుజ్వేంద్ర చాహల్ (4/28) చెలరేగిన వేళ.. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 16 పరుగులు తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వేశ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే?
చాహల్ మాయ..
మొదట బ్యాటింగ్ కు దిగిన పంబాజ్ కింగ్స్ 112 పరుగులు మాత్రమే లక్ష్యం నిర్దేశించింది. దీంతో కేకేఆర్ ఈ లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేస్తుందని అంతా భావించారు. పంజాబ్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు అనూహ్యంగా తారుమరయ్యాయి. ఛేదనలో కేకేఆర్ తడబడింది. అందుకు ముఖ్య కారణం పంబాజ్ బౌలర్ చాహల్. అతడు తన అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచును తమ వైపునకు తిప్పాడు. మొదట ఇన్నింగ్స్ 8, 10 ఓవర్లలో రహానె, రఘువంశీలను ఔట్ చేసిన చాహల్.. 12వ ఓవర్లో రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ (0)ను ఔట్ చేసి కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇతర పంజాబ్ బౌలర్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మ్యాచులో ఇతర వికెట్లు తీశారు. దీంతో కేకేఆర్ 95 పరుగులకే కుప్పకూలిపోయింది.

అసంభవ్...
ఈ క్రమంలోనే నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీంతో అతడి రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వేశ్.. ఓ పోస్ట్ పెట్టింది. "వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్ హి ఈజ్. అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. అందుకే ఈ ఐపీఎల్ లో అతడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అసంభవ్" అంటూ అతడితో కలిసి దిగిన సెల్ఫీనీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ తో పాటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.