బూతులు తిట్టిన వరుణ్ చక్రవర్తి!.. వీడియో వైరల్!!
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠతో పాటు స్డేడియంలో హైవోల్టేజ్ డ్రామాకు వేదికైంది. ముంబై ఇన్నింగ్స్ సమయంలో కేకేఆర్ ప్లేయర్ల మధ్య జరిగిన ఓ పొరపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫామ్‌లో ఉన్న ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఇచ్చిన ఓ సులువైన క్యాచ్‌ను కేకేఆర్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆ క్యాచ్‌ను రెండు చేతులతో సురక్షితంగా అందుకునే సమయానికి వికెట్ కీపర్ అంగ్క్రిష్ రఘువంశీ చేసిన అత్యుత్సాహం వల్ల ఆ క్యాచ్ చేజారింది.
ఫీల్డింగ్ సమయంలో వరుణ్ చక్రవర్తి క్యాచ్ కోసం ముందే కాల్ ఇచ్చినప్పటికీ.. అంగ్క్రిష్ రఘువంశీ బంతిని క్యాచ్ పట్టుకోవడానికి వరుణ్ వైపు దూకాడు. ఈ క్రమంలో ఇద్దరు గట్టిగా ఢీకొనడంతో వరుణ్ చక్రవర్తి చేతుల్లో పడిన బంతి కాస్తా కిందపడిపోయిది. తాను పట్టుకున్న క్యాచ్ ను కీపర్ నిర్లక్ష్యం వల్ల చేజార్చుకోవాల్సి రావడంతో వరుణ్ చక్రవర్తి స్టేడియంలోనే రఘువంశీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఊహించని ఘర్షణ, డ్రామాను చూసి స్టేడియంలోని అభిమానులతో పాటు టీవీ ప్రేక్షకులు సైతం షాక్‌కు గురయ్యారు.

అయితే ఈ క్యాచ్ డ్రాప్ వల్ల కేకేఆర్ జట్టుకు పెద్దగా నష్టం జరగలేదు. లభించిన లైఫ్ లైన్‌ను ముంబై బ్యాటర్ తిలక్ వర్మ అస్సలు ఉపయోగించుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ అద్భుతమైన సెంచరీతో ఫామ్‌లో ఉన్న తిలక్.. ఈ మ్యాచ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 20 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ తక్కువ పరుగులు చేయడం ఒకెత్తయితే.. టీ20 మ్యాచ్‌లో వన్డే కంటే ఘోరంగా అత్యంత నిదానంగా బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిలక్ వర్మ ఈ 20 పరుగులు చేయడానికి ఏకంగా 32 బంతులు ఆడాడు, దీనితో తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ కేవలం 62.5 గా నమోదైంది.
తిలక్ వర్మ ఖాతాలో చెత్త రికార్డు
ఈ మ్యాచ్‌తో తిలక వర్మ ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 30 కంటే ఎక్కువ బంతులు ఆడి ఇంత తక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేయడం దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇంతకుముందు మే 2012లో జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ మైఖేల్ హస్సీ 32 బంతుల్లో కేవలం 19 పరుగులు చేశాడు (స్ట్రైక్ రేట్ 59.37). మళ్లీ ఇన్నాళ్లకు తిలక్ వర్మ అంతటి పేలవమైన ప్రదర్శన చేయడంతో, ఇది అతని టీ20 కెరీర్‌లోనే ఒక పెద్ద మైనస్‌గా మిగిలిపోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications