
శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే..
''మేము మొదట బౌలింగ్ చేస్తాము. నిర్ణీత లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మేము ఛేజింగ్ చేయగలం. అన్ని జట్లు సమానంగా బలమైనవి. మేము ఎల్లప్పుడూ విన్నింగ్ మనస్తత్వంతో ఉంటాం. ఈ మ్యాచ్‌లో మేము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. టిమ్ సౌథీ స్థానంలో పాట్ కమ్మిన్స్, శివమ్ మావి స్థానంలో రసిఖ్ సలాం ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. సౌథీ టీంకు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. జట్టు మార్పుల గురించి మేము అందరితో మాట్లాడాం'' అని కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.

రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
''టాస్ గెలిస్తే మేము ముందుగా బ్యాటింగే చేయాలని అనుకున్నాం. గత 2 గేమ్‌లలో ఏమి జరిగిందని మేము ప్రస్తుతం ఆలోచించడం లేదు. మ్యాచ్‌లు గెలవాలంటే మేము మంచి క్రికెట్ ఆడాలి. దాని కోసం మేము సిద్ధంగా ఉన్నాము. ఇది మంచి పిచ్‌లా కనిపిస్తోంది. మేము మ్యాచ్‌లు గెలవాలనుకున్నప్పుడు సమిష్టి ప్రదర్శన ఇవ్వాలి. కానీ గత 2 గేమ్‌లలో అది మిస్ అయినట్లు నేను భావిస్తున్నాను. ఈ మ్యాచ్‌లో మేము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. అన్మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ స్థానంలో డెవాల్డ్ బ్రీవిస్ జట్టులోకి వచ్చారు.'' అని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి


Click it and Unblock the Notifications












