For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR Vs MI:మూడు తప్పిదాలు.. ముగ్గురి వైఫల్యాలు: ఇదే కోల్‌కతా కొంప ముంచింది..!

KKR Vs MI:Three biggest mistakes committed by Dinesh Karthik team over Mumbai
IPL 2020,KKR vs MI : 3 Major Mistakes Done By KKR Against MI || Oneindia Telugu

దుబాయ్: ఐపీఎల్ 13వ ఎడిషన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ మొత్తం వన్ సైడెడ్‌గానే ముగిసింది. ఏ దశలోనూ కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబై విధించిన విజయలక్ష్యం చేధిస్తుందన్న భావన ఎక్కడా కలగలేదు. అయితే చివరి ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పుంజుకున్నప్పటకీ మ్యాచ్ విజయం మాత్రం ముంబైనే వరించింది.

 కోల్‌కతా తప్పిదాలు

కోల్‌కతా తప్పిదాలు

బుధవారం జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 195 పరుగులు చేసింది. 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన నైట్ రైడర్స్ జట్టులో దినేష్ కార్తీక్ మరియు రానాలు మంచి స్టార్ట్ ఇచ్చినా ఆ తర్వాత దాన్ని ఆ జట్టు నిలుపుకోలేకపోయింది. చివరిలో పాట్ కమ్మిన్స్ మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు. బుమ్రా వేసిన ఓవర్లో ఏకంగా నాలుగు భారీ సిక్సులు బాదాడు కమ్మిన్స్ . ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు వ్యూహాత్మక తప్పిదాలు జరిగాయి.

 రోహిత్ శర్మకు షార్ట్ బాల్స్..

రోహిత్ శర్మకు షార్ట్ బాల్స్..

ఫామ్‌లో ఉన్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సులు 3 ఫోర్లు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు కమ్మిన్స్, సందీప్ వారియర్, సునీల్ నరైన్‌లు బౌలింగ్‌లో విఫలమయ్యారు. షార్ట్ పిచ్ బంతులు వేయగా రోహిత్ శర్మ వాటిని సునాయాసంగా బౌండరీకి తరలించాడు. షార్ట్ బాల్స్ ఆడటంలో రోహిత్ శర్మ దిట్ట. అందునా డీప్‌లో సరిపడా ఫీల్డర్లు లేకపోవడంతో దీన్నే అవకాశంగా మలుచుకున్న రోహిత్ బంతిని చక్కగా బౌండరీ వైపు బాదాడు. రోహిత్ శర్మకు షార్ట్ బంతులు వేయడమే కోల్‌కతా నైట్ రైడర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం

 రాహుల్ త్రిపాఠి, సిద్దేశ్ లాడ్‌లు ఉండగా నిఖిల్ నాయక్‌తో...

రాహుల్ త్రిపాఠి, సిద్దేశ్ లాడ్‌లు ఉండగా నిఖిల్ నాయక్‌తో...

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్ పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ జట్టులో ఒక ఇండియన్ ఆల్‌రౌండర్ లేకపోవడం అనే లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడో స్థానంలో ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ను ఆడించడంలో అర్థం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడే కోల్‌కతా నిఖిల్ నాయక్‌ను ఆడించి పెద్ద తప్పిదం చేసింది. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 1 పరుగు మాత్రమే చేశాడు. అప్పటికే మ్యాచ్ ముంబై వైపుకు మరలింది. రాహుల్ త్రిపాఠీ కానీ సిద్దేశ్ లాడ్‌లతో కానీ ఓపెనింగ్ చేయించి శుభమన్ గిల్‌ను మూడో స్థానంలో పంపి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడో స్థానంలో బ్యాట్స్‌మెన్‌ను పంపడం సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

 బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆండ్రూ రస్సెల్‌ను..

బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆండ్రూ రస్సెల్‌ను..

ఇక కోల్‌కతా జట్టుకు కొండంత బలం ఆండ్రూ రసెల్. ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్. ఆరోజు తనదైతే ఇక ప్రత్యర్థి జట్టు బేజార్ పడాల్సిందే. రస్సెల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసి ఉండి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్, కెప్టెన్ దినేష్ కార్తీక్‌లు మాత్రం రస్సెల్‌ను తర్వాత పంపుదామనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. నాలుగు వికెట్లు కోల్పోయి 77 పరుగులు ఉండగా ఆరో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా రస్సెల్ బరిలోకి దిగాడు. అప్పటికే రన్‌రేట్ కొండను తాకుతోంది. సెటిల్ కావడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. నాలుగు బంతుల తేడాతో రస్సెల్, మోర్గాన్‌లు ఇద్దరూ ఔట్ అవడంతో కోల్‌కతా విజయావకాశాలు సన్నగిల్లాయి. మొత్తానికి కోల్‌కతా చేసిన ఈ మూడు తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Story first published: Thursday, September 24, 2020, 11:19 [IST]
Other articles published on Sep 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+