For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs MI: ముంబైని ఆదుకున్న సూర్య‌, తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌.. కోల్‌క‌తా ముందు ట‌ఫ్‌ టార్గెట్‌

KKR vs MI: Suryakumar Yadav (52) and Tilak Verma (38 ) defended the Mumbai Indians. Kolkata Knight Riders target 162 runs.
IPL 2022 : SKY Is Back | Mumbai Indians Batting Highlights Vs KKR | Oneindia Telugu

పుణే: సూర్య‌కుమార్ యాద‌వ్‌, తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్‌తో ఆదుకోవ‌డంతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు ముంబై ఇండియ‌న్స్ 162 ప‌రుగుల ట‌ఫ్ ల‌క్ష్యాన్ని ఉంచింది. న‌త్త న‌డ‌క‌ను ప్రారంభ‌మైన ముంబై ఇన్నింగ్స్ ఓ ద‌శ‌లో 120 ప‌రుగులు చేస్తే అదే ఎక్కువ అనిపించింది. కానీ సూర్య‌కుమార్ యాదవ్ హాఫ్ సెంచ‌రీ, తిల‌క్ వ‌ర్మ చెల‌రేగ‌డం, చివరి ఓవ‌ర్లో పొలార్డు మెర‌పులు మెరిపించ‌డంతో ముంబై స్కోర్ 160 దాటింది. గాయం నుంచి కోలుకుని ఆడిన మొద‌టి మ్యాచ్‌లోనే సూర్య‌కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీ చేయ‌డం గ‌మ‌నార్హం.

 రోహిత్ మ‌ళ్లీ విఫ‌లం

రోహిత్ మ‌ళ్లీ విఫ‌లం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్‌ను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ ఆరంభంలోనే దెబ్బ‌కొట్టాడు. ఉమేష్ త‌న సూప‌ర్ ఫామ్ చాటుతూ ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్లోనే రోహిత్ శ‌ర్మ‌ను ఔట్ చేశాడు. 12 బంతుల్లో కేవ‌లం 3 ప‌రుగులే చేసి రోహిత్ శ‌ర్మ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. ఇక కేకేఆర్ బౌల‌ర్లు క‌ట్ట‌డి చేయ‌డంతో ప‌వ‌ర్‌ప్లే ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి ముంబై 35 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

11 ఓవ‌ర్ల‌కు 55 ప‌రుగులే

11 ఓవ‌ర్ల‌కు 55 ప‌రుగులే

ఇక తొమ్మిదో ఓవ‌ర్లో ఇషాన్ కిష‌న్(21 బంతుల్లో 14 ర‌న్స్‌)ను క‌మిన్స్‌, 11వ ఓవ‌ర్లో డెవాల్డ్ బ్రెవిస్ (19 బంతుల్లో 29 ర‌న్స్‌.. 2 ఫోర్లు, 2 సిక్సులు)ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఔట్ చేయ‌డంతో మంబై 55 ప‌రుగుల‌కు 3 వికెట్లు కోల్పోయింది. కాగా 11 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి కేవ‌లం 5 ర‌న్‌రేట్‌తో ముంబై ఇండియ‌న్స్ 55 ప‌రుగులే చేసింది. 15 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి ఆ జ‌ట్టు 85 ప‌రుగులే చేసిందంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

ఆదుకున్న సూర్య‌, తిల‌క్

ఆదుకున్న సూర్య‌, తిల‌క్

ఈ స‌మ‌యంలో ముంబై ఇండియ‌న్స్‌ను సూర్య‌కుమార్ యాద‌వ్, తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ ఆదుకున్నారు. ఆరంభంలో నిదానంగా ఆడిన‌ప్ప‌టికీ క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడారు. 13వ ఓవ‌ర్లో సూర్య‌కుమార్ యాద‌వ్ బాదిన ఫోర్ ద్వారా మ్యాచ్‌లో 34 బంతుల త‌ర్వాత ముంబై మ‌ళ్లీ బౌండ‌రీ న‌మోదు చేసింది. 12వ ఓవ‌ర్లో తిల‌క్ వ‌ర్మ క్యాచ్‌ను మిస్ చేయ‌డంతో దానికి కోల్‌క‌తా మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఇద్ద‌రు క‌లిసి నాల్గో వికెట్‌కు 49 బంతుల్లోనే 83 ప‌రుగులు జోడించారు. ఈ క్ర‌మంలో సూర్య‌కుమార్ యాద‌వ్ ఐపీఎల్‌ కెరీర్లో 14వ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

చివ‌రి ఓవ‌ర్లో పొలార్డు మెర‌పులు

చివ‌రి ఓవ‌ర్లో పొలార్డు మెర‌పులు

20వ ఓవ‌ర్ మొద‌టి బంతికి పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ (36 బంతుల్లో 52 ర‌న్స్‌, 5 ఫోర్లు, 2 సిక్సులు) వికెట్ కీప‌ర్ సామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. అనంత‌రం క్రీజులోకి వచ్చిన కీర‌న్ పొలార్డు మెర‌పులు మెరిపించాడు. చివ‌రి 5 బంతుల్లోనే 22 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 3 సిక్సులు బాదాడు.

వికెట్ల వెనుక‌కు పొలార్డు బాదిన సిక్సులు ఆక‌ట్టుకున్నాయి. పొలార్డు ధాటికి చివ‌రి ఓవ‌ర్లో 23 పరుగులు వ‌చ్చాయి. ఇక చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో 66 ర‌న్స్ వ‌చ్చాయి. మొత్తానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 161 ప‌రుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ 27 బంతుల్లో 38 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో క‌మిన్స్ రెండు, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఉమేష్ యాద‌వ్ త‌లో వికెట్ తీశారు.

Story first published: Wednesday, April 6, 2022, 22:04 [IST]
Other articles published on Apr 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+