KKR vs Mi ప్రివ్యూ: కోల్‌కతా బోణీ కొట్టేనా.. రోహిత్ సేన ఖాతా తెరిచేనా? తుది జట్లు ఇవే!

IPL 2020 : KKR vs MI Preview, Pitch Report | Head-to-Head Players || Oneindia Telugu

అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్దమైంది. భీకరమైన బ్యాట్స్‌మెన్‌తో నిండి ఉన్న మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మధ్య అబుదాబి వేదికగా మరికొద్ది గంటల్లో మ్యాచ్ జరగనుంది. కేకేఆర్‌కు ఇది తొలి మ్యాచ్ కాగా.. విజయంతో లీగ్ ప్రారంభించాలని భావిస్తోంది. మరోవైపు గతంలో మాదిరిగానే లీగ్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్‌కు షాక్ ఇచ్చి విన్నింగ్ ట్రాక్‌లో పడాలని పట్టుదలగా ఉంది. ఫలితం ఎలా ఉన్నా.. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇవ్వనుంది.

పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో పాటు విధ్వంసకర వీరుల కొదవలేకపోవడంతో రెండు జట్లు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడగా 19-6తో ముంబై ఇండియన్స్ లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి!

రస్సెల్‌పైనే అందరిచూపు..

రస్సెల్‌పైనే అందరిచూపు..

గత సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న విండీస్ వీరుడు ఆండ్రూ రస్సెల్‌పైనే అందరిచూపు ఉంది. పైగా అతన్ని టాపార్డర్‌లో ఆడిస్తామని కేకేఆర్‌ మేనేజ్‌మెంట్ చెప్పడంతో అతని బ్యాటింగ్‌పై ఆసక్తి నెలకొంది. కెరీర్‌లో మూడో ఐపీఎల్ ఆడనున్న శుభ్‌మన్ గిల్‌పై నైట్‌రైడర్స్ భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కు తోడు ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, నితీశ్ రాణా, సునీల్ నరైన్, లూకీ ఫెర్గూసన్ తదితరులతో కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.

కేకేఆర్ బౌలింగ్‌ విజయానికి వస్తే.. ఈ సీజన్‌ వేలంలో అత్యధికంగా రూ.15.5 కోట్లు పెట్టి తీసుకున్న ప్యాట్ కమిన్స్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. కుల్దీప్ యాదవ్, కమలేశ్ నాగర్‌కోటి, శివం మావి, ప్రసిద్ క్రిష్ణలతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. యూఏఈలో స్పిన్నర్లు రాణిస్తున్న నేపథ్యంలో సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్ ఏమేరకు రాణిస్తారనేది ఆసక్తికరం.

బుమ్రా, రోహిత్ రాణించాలి..

బుమ్రా, రోహిత్ రాణించాలి..

డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా పేరున్న జస్ర్పీత్‌ బుమ్రా అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఇది ఆ జట్టును కలవరపెడుతుంది. మరోవైపు బ్యాటింగ్‌లో సౌరభ్ తివారీ మినహా అంతా విఫలమయ్యారు. అనవసర షాట్లకు పోయి మూల్యం చెల్లించుకున్నారు. ఈ పరిస్థితుల్లో రోహిత్‌తో సహా అంతా చెలరేగాలి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోకి ఇషాన్ కిషాన్‌ను తీసుకోవచ్చు. బౌలింగ్ విభాగంలో జేమ్స్ పాటిన్సన్‌ బదులు కౌల్టర్ నీల్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. కృనాల్, రాహుల్ చహర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా.. గత మ్యాచ్‌లో దారళంగా పరుగులిచ్చారు. వారు పొదుపుగా బౌలింగ్ చేయాల్సి అవసరం ఉంది. ఇక గత మ్యాచ్‌లో బౌలింగ్ చేయని, హార్దిక్, పొలార్డ్ కొన్ని ఓవర్లు పంచుకుంటే ముంబై బౌలింగ్‌కు తిరుగుండదు. జట్టులోని ఆటగాళ్లంతా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ముంబైకి తొలి విజయం దక్కుతుంది.

తుది జట్లు..

తుది జట్లు..

ముంబై: రోహిత్‌శర్మ(కెప్టెన్‌), క్వింటన్ డికాక్‌(కీపర్‌), సౌరభ్‌ తివారి, సూర్యకుమార్‌ యాదవ్‌/ఇషాన్ కిషన్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, పాటిన్సన్‌/కౌల్టర్‌నీల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా, రాహుల్‌ చాహర్‌

కోల్‌కతా: దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సునిల్‌ నరైన్‌, శుభ్‌మన్‌గిల్‌, నితీశ్‌ రాణా, మోర్గాన్‌, అండ్రీ రసెల్‌, కమిన్స్‌, కుల్దీప్‌యాదవ్‌, కమలేశ్‌ నాగర్ కోటి, శివం మావి, ప్రసిద్‌ కృష్ణ

పిచ్ రిపోర్టు

పిచ్ రిపోర్టు

డ్యూ ప్రభావం ఉండనుంది. ముంబై, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ పరిస్థితులే ఉండనున్నాయి. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. గత నాలుగు మ్యాచుల్లోనూ టాస్‌ గెలిచిన కెప్టెన్‌లు చేజింగ్‌కు మొగ్గు చూపించడం గమనార్హం. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఏడో స్థానంలో ధోనీ రావడం బుద్ది తక్కువ పని.. ఆ హ్యాట్రిక్ సిక్స్‌లు ఎందుకు పనికిరావు: గౌతమ్ గంభీర్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 23, 2020, 14:25 [IST]
Other articles published on Sep 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X