కమిన్స్ విధ్వంసం
13.1 ఓవర్లో 101 పరుగుల వద్ద కోల్‌కతా ఐదో వికెట్ కోల్పోయిన దశలో పాట్ కమిన్స్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికీ మ్యాచ్ హోరాహారీగా సాగుతుంది. కేకేఆర్ గెలవాలంటే మరో 41 బంతుల్లో 61 పరుగులు చేయాలి. అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ధాటిగా ఆడిన కమిన్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక కోల్‌కతా విజయానికి చివరి 5 ఓవర్లలో 35 పరుగులు కావాల్సి ఉండగా.. డేనియల్ సామ్స్‌కు రోహిత్ శర్మ బౌలింగ్ ఇచ్చాడు. అప్పటికే ఓ వికెట్ తీసి సామ్స్ జోరు మీదున్నాడు.

ఒకే ఓవర్లో 35 రన్స్
ఆ ఓవర్ అన్ని బంతులను కమిన్స్ బౌండరీలు బాదేశాడు. మొదటి బంతి సిక్సు, రెండో బంతి పోర్, మూడు, నాల్గో బంతులు సిక్సులు బాదాడు. ఐదో బంతికి బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ పట్టినప్పటికీ అది ఫ్రీ హిట్ అవడంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించడంతో కమిన్స్ బతికి పోయాడు. ఆ బంతికి ఫ్రీ హిట్‌తోపాటు 2 పరుగులు వచ్చాయి.
ఇక ఐదో బంతికి ఫోర్, ఆరో బంతికి సిక్సు బాది కోల్‌కతాను గెలిపించాడు. మొత్తంగా ఆ ఓవర్లో 35 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లో కమిన్స్ దెబ్బకు 6, 4, 6, 6, N2, 4, 6 గా పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 15 బంతుల్లోనే 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. ఇలా ఊహించని మలుపుతో మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే కోల్‌కతా గెలిచింది. ఇక సామ్స్ 3 ఓవర్లలోనే 50 పరుగులు ఇచ్చాడు.

వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ
అంతకుముందు 162 పరుగుల లక్ష్య చేధనలో కోల్‌కతాకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. రహానే (7) నిరాశపరిచాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (10), బిల్లింగ్స్ (17), నితీష్ రానా (8), ఆండ్రూ రసెల్ (11) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో 101 పరుగులకు కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (50*) మాత్రం అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కమిన్స్, వెంకటేశ్ అయ్యర్ కలిసి 17 బంతుల్లోనే 61 పరుగుల అజేయభాగస్వామ్యంతో కోల్‌కతాను గెలిపించారు. ముంబై బౌలర్లలో మిల్స్, మురుగన్ అశ్విన్ రెండేసి వికోట్లు, సామ్స్ ఒక వికెట్ తీశారు.


కోల్‌కతా టార్గెట్ 162 రన్స్
అంతకుముందు టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. కోల్‌కతానైట్ రైడర్స్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో బ్యాటింగ్‌ను నత్తనడకన ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ స్కోర్ బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు. అయినప్పటికీ ఆ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 35 పరుగులు, 11 ఓవర్లు ముగిసే సమయానికి 55 పరుగులు, 15 ఓవర్లు ముగిసే సమయానికి 85 పరుగులు మాత్రమే చేసింది.

చివరి 5 ఓవర్లలో 76 పరుగులు
చివరి 5 ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. చివరి ఓవర్లో పొలార్డు 5 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మొత్తంగా చివరి 5 ఓవర్లలో 76 పరుగులు వచ్చాయి. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 52, తిలక్ వర్మ 38*, డెవాల్డ్ బ్రెవిస్ 29, పొలార్డు 22*, ఇషాన్ కిషన్ 14, రోహిత్ శర్మ 3 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ 2, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
స్కోర్లు
ముంబై ఇండియన్స్: 161-4
కోల్‌కతానైట్ రైడర్స్:162-5
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: పాట్ కమిన్స్


Click it and Unblock the Notifications
