కమిన్స్ బౌలింగ్‌లో సూపర్ సిక్సు
కోల్‌కతా నైట్ రైడర్స్ సీనియర్ పేసర్ పాట్ కమిన్స్ వేసిన 16వ ఓవర్ తొలి బంతిని 19 ఏళ్ల తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా సిక్సు బాదాడు. మోకాలిపై కాస్త వెనుకకు వంగి ఫైన్ లెగ్ మీదుగా అద్బుతంగా సిక్సు కొట్టాడు. తిలక్ వర్మ కొట్టిన సిక్సు దెబ్బకు బౌలింగ్ వేసిన కమిన్స్ మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకోవాలి. ముంబై ఆటగాళ్లు, అభిమానులు మాత్రం ఆ అద్భుత షాట్‌కు తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు కూడా తిలక్ వర్మ టాలెంట్‌ను కొనియాడుతున్నారు. ప్రస్తుతం తిలక్ వర్మ బాదిన ఈ సిక్సు నెట్టింట వైరల్‌గా మారింది.

చెలరేగిన తిలక్ వర్మ
కమిన్స్ వేసిన ఆ ఓవర్లో 6, 0,1, 4, 1తో తిలక్ వర్మ 12 పరుగులు రాబట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొని 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. 11 ఓవర్లలో ముంబై 3 వికెట్లు కోల్పోయి 55 మాత్రమే పరుగులు చేసిన దశలో క్రీజులో వచ్చిన తిలక్ వర్మ.. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 55 బంతుల్లోనే 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కోల్‌కతా టార్గెట్ 162 రన్స్
ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు ముంబై ఇండియన్స్ 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో బ్యాటింగ్‌ను నత్తనడకన ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ స్కోర్ బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు. అయినప్పటికీ ఆ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 35 పరుగులు, 11 ఓవర్లు ముగిసే సమయానికి 55 పరుగులు, 15 ఓవర్లు ముగిసే సమయానికి 85 పరుగులు మాత్రమే చేసింది.

చివరి 5 ఓవర్లలో 76 పరుగులు
చివరి 5 ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. చివరి ఓవర్లో పొలార్డు 5 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మొత్తంగా చివరి 5 ఓవర్లలో 76 పరుగులు వచ్చాయి. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 52, తిలక్ వర్మ 38*, డెవాల్డ్ బ్రెవిస్ 29, పొలార్డు 22*, ఇషాన్ కిషన్ 14, రోహిత్ శర్మ 3 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ 2, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












