For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs MI: ముంబైపై ఘోర పరాజయం.. కోల్‌కతా ఖాతాలో చెత్త రికార్డు!!

KKR vs MI: Kolkata Knights Riders lose their first opener since 2012
IPL 2020, MI vs KKR : Kolkata Knight Riders Lose Their First Opener Since 2012

అబుదాబి: ఐపీఎల్‌ 2020లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించి ఖాతా తెరిచింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కేకేఆర్‌ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో గెలుపుతో టోర్నీలో బోణీ కొట్టాలనుకున్న కేకేఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. అంతేకాదు 2012 తర్వాత తొలిసారి ఆ జట్టుకు అనూహ్యంగా తొలి మ్యాచ్‌ పరాభవం ఎదురైంది.

 కేకేఆర్‌ చెత్త రికార్డు:

కేకేఆర్‌ చెత్త రికార్డు:

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న కేకేఆర్‌ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. 2013 నుంచి 2019 వరకూ కేకేఆర్‌ ఎప్పుడూ తన ఆరంభపు మ్యాచ్‌లో ఓడిపోలేదు. అయితే తాజా సీజన్‌ కేకేఆర్‌ తన ఓపెనింగ్‌ మ్యాచ్‌లోనే ఓటమి పాలై రికార్డును సవరించుకుంది. 2013లో కేకేఆర్‌ తన ఆరంభపు మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఢిల్లీ నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

41 పరుగుల తేడాతో చిత్తు:

41 పరుగుల తేడాతో చిత్తు:

2014లో ముంబైని ఏకంగా 41 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 164 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబైని 122/7కు పరిమితం చేసి కేకేఆర్‌ జయకేతనం ఎగురవేసింది. 2015లోనూ ఇదే పునరావృతమైంది. ముంబై నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో 18.3 ఓవర్లకే ఛేదించింది. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించగా, 2017లో గుజరాత్‌ లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ సీజన్‌లో ఓటమి:

ఈ సీజన్‌లో ఓటమి:

2018లో బెంగళూరు తన ముందుంచిన 177 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల నష్టానికి 18.5 ఓవర్లలోనే పూర్తిచేసింది. 2019లో హైదరాబాద్‌ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో మరో 2 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. అయితే ఈ సీజన్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో గత రికార్డును కేకేఆర్‌ కొనసాగించడంలో విఫలమైంది.

ముంబై బోణీ:

ముంబై బోణీ:

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ముంబై లీగ్‌లో బోణీ కొట్టింది. బుధవారం అబుదాబి వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌సేన 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. భీకర హిట్టర్ల జట్టుగా పేరున్న కోల్‌కతా జట్టు ముంబై బౌలర్ల ముందు నిలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రోహిత్‌ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. పాట్ కమిన్స్‌ (33, 12 బంతుల్లో; 1×4, 4×6) సిక్సర్లతో మెరిసినా లాభం లేకపోయింది.

KKR vs MI: హార్దిక్ పాండ్యా చెత్త రికార్డు.. ఐపీఎల్ 2020లో తొలి బ్యాట్స్‌మన్‌ అతడే!!

Story first published: Thursday, September 24, 2020, 14:09 [IST]
Other articles published on Sep 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+