
జూనియర్ డివిల్లియర్స్ మెరుపులు
రోహిత్ శర్మ ఔటవ్వగానే ఆశ్చర్యకరంగా మూడో స్థానంలోనే సౌతాఫ్రికాకు చెందిన బేబి డివిల్లియర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. అప్పటివరకు నత్తనడకన ఉన్న ముంబై స్కోర్‌లో తన సూపర్ బ్యాటింగ్‌తో వేగం పెంచాడు.
ఈ క్రమంలో ఫాంలో ఉన్న ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్‌ను అద్భుతంగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదాడు. భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించినప్పటికీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న డెవాల్డ్ బ్రెవిస్ 2 ఫోర్లు, 2 సిక్సులతో 29 పరుగులు చేశాడు.
బిల్లింగ్స్ సూపర్ స్టంపౌట్
సూపర్ షాట్లతో చెలరేగుతున్న డెవాల్డ్ బ్రెవిస్‌ను కోల్‌కతా వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ సూపర్ స్టంపింగ్‌తో ఫెమిలియన్ చేర్చాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతిని డెవాల్డ్ బ్రెవిస్ ముందుకు వెళ్లి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ లైన్ మిస్సవడంతో వెంటనే బంతిని అందుకున్న బిల్లింగ్స్ అంతే వేగంతో వికెట్లను కొట్టాడు. దీంతో డెవాల్డ్ బ్రెవిస్ దూకుడుకు బ్రేక్ పడింది.

పవర్‌ప్లేలో ఉమేష్ అదుర్స్
ఐపీఎల్ 2022లో పవర్‌ప్లేలో ఉమేష్ యాదవ్ చెలరేగుతున్నాడు. ఈ లీగ్‌లో ఉమేష్ యాదవ్ ఇప్పటివరకు 9 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా ఉండగా.. అందులో పవర్‌ప్లేలోనే 6 వికెట్లు తీయడం గమనార్హం. పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే కాకుండా పరుగులు రాకుండా కట్టడి చేస్తున్నాడు. దీంతో పవర్‌ప్లేలోనే ఉమేష్ యాదవ్ కోల్‌కతాను విజయానికి చేరువ చేస్తున్నాడని చెప్పుకోవాలి. కాగా మెగా వేలంలో ఉమేష్ యాదవ్ రెండు సార్లు అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగలగా.. మూడోసారి 2 కోట్ల రూపాయల కనీస ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

తడబడుతున్న ముంబై
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ తడబడుతుననంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు. ఉన్నారు. రోహిత్ 3, డెవాల్డ్ బ్రెవిస్ 29, ఇసాన్ కిషన్ 14 పరుగులు చేశారు. ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, కమిన్స్ తలో వికెట్ తీశారు.

తుది జట్లు
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి


Click it and Unblock the Notifications












