Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs LSG: కళ్లు చెదిరే క్యాచ్.. బిత్తరపోయిన హుడా (Video)

ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరుగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ - లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.. లక్నో బ్యాటర్లను కట్టడి చేస్తోంది. పవర్‌ప్లేలో లక్నోను 49/2కు పరిమితం చేసింది. క్వింటన్ డికాక్ (10; 8 బంతుల్లో), దీపక్ హుడా (8; 10 బంతుల్లో) పెవిలియన్‌కు చేరారు.

అయితే లక్నోకు డికాక్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతుల్ని బౌండరీలు సాధించి స్టార్క్‌కు తన స్టైల్‌లో డికాక్ స్వాగతం చెప్పాడు. దీంతో మొదటి ఓవర్‌లో లక్నో పది పరుగులు సాధించింది. కానీ రెండో ఓవర్‌లో డికాక్‌ను వైభవ్ అరోరా ఔట్ చేసి లక్నోను దెబ్బకొట్టాడు.

KKR vs LSG Ramandeep Singh s Spectacular Flying Catch Video goes viral

అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. రమణ్‌దీప్ సింగ్ అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్‌లో హుడా షాట్‌కు యత్నించగా బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రమణ్‌దీప్ నేలకు సమాంతరంగా డైవ్ చేస్తూ కళ్లుచెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలోపే లక్నో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ పేవలమైన రికార్డు నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు కోల్పోయిన జట్టుగా చెత్త రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్-2024లో ఆరు ఓవర్లలోపు లక్నో 12 వికెట్లు కోల్పోయింది. లక్నో తర్వాతి స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (11 వికెట్లు), పంజాబ్ కింగ్స్ (9 వికెట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (9 వికెట్లు), రాజస్థాన్ రాయల్స్ (9 వికెట్లు) ఉన్నాయి.

కాగా, వన్‌డౌన్‌లో దేవదత్ పడిక్కల్ వరుసగా విఫలమవడంతో ఈ మ్యాచ్‌లో దీపక్ హుడాకు లక్నో టీమ్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. కానీ దీపక్ కూడా నిరాశపరిచాడు. ఐపీఎల్-2023 నుంచి 15 ఇన్నింగ్స్‌ల్లో దీపక్ కేవలం 128 పరుగులే చేయడం గమనార్హం. కేవలం 9 సగటుతో పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 26 మాత్రమే.

Story first published: Sunday, April 14, 2024, 16:48 [IST]
Other articles published on Apr 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+