
ఒక్క విజయం కోసం ముప్పుతిప్పలు పడుతున్న లక్నో
లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ ఖాయమనుకున్న దశలో వరుసగా రెండింట్లో ఓడింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జెయింట్స్ ప్లేఆఫ్స్ ముగింట్లో తచ్చాడుతోంది. గెలిస్తే 18పాయింట్లతో దర్జాగా ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెడుతుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఆల్‌రెడీ ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే లక్నోకు ఉన్న అడ్వాంటేజీ ఏంటంటే ప్రస్తుతం 16పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నందున.. ఆ జట్టుకు చాలా సానుకూలాంశాలున్నాయి. ఆర్సీబీ, ఢిల్లీ జట్లు వాటి చివరి మ్యాచ్‌ల్లో ఒక్క జట్లు ఓడిపోయినా లక్నో ప్లేఆఫ్ చేరుతుంది. అవి రెండు గెలిచినా కూడా నెట్ రన్ రేట్ తేడాతో లక్నోకు ఆర్సీబీ కంటే ఎక్కువ అవకాశాలుంటాయి.

కేకేఆర్‌కు ప్రధాన లోపం అదే
ఇక కేకేఆర్‌కు ఈ సీజన్లో ప్రధాన లోపం ఏంటంటే ఓపెనర్లు విఫలం కావడమే. గత రెండు మూడు మ్యాచ్‌లుగా ఓపెనర్లు అంతో ఇంతో రాణిస్తున్నారు. కానీ పెద్దగా స్టాండ్ తీసుకోవట్లేదు. ఇక ఈ సీజన్లలో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది కూడా కేకేఆర్ ఓపెనర్లు. ఈ సీజన్లో 20పరుగుల కన్న తక్కువ ఎవరేజీ కలిగిన ఓపెనర్లు కలిగిన ఏకైక టీం కేకేఆర్. ఆ జట్టు ఓపెనర్లుగా ఆడిన వారి సగటు చాలా చెత్తగా ఉంది. వెంకటేష్ అయ్యార్ -19.9, రహానే - 19, ఫించ్ - 17.2, నరైన్ - 2,0, బిల్లింగ్స్ - 4.0, ఇంద్రజిత్ 7.5గా ఉంది. ఎక్కువమంది ప్లేయర్లను ఓపెనర్లుగా ప్రయోగించడం కూడా ఓపెనింగ్ జోడీ కేకేఆర్ టీంకు సరిగా కుదురుకోలేదు.

కేకేఆర్‌కు ప్రధాన బలం ఇదే
ఇక కేకేఆర్‌కు ఈ సీజన్లోనే కాదు చాలా సీజన్లలోనూ కేకేఆర్‌కు ప్రధాన బలం ఆల్రౌండర్లు, బౌలర్లే. ముఖ్యంగా ఆల్రౌండర్లు కేకేఆర్‌కు కీలక సపోర్టివ్‌గా ఉంటున్నారు. అందులో చెప్పుకోదగ్గవాడు ఆండ్రీ రస్సెల్. ఇకపోతే బ్యాటింగ్ పరంగా రస్సెల్ ఎంతటి విధ్వంసకారుడో తెలిసిందే. అయితే బౌలింగ్లోనూ రస్సెల్ జట్టుకు మంచి న్యాయం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈ సీజన్లో 15వికెట్లు కూడాత తీశాడు. 15వికెట్ల కంటే ఎక్కువ వికెట్లు ఒకే సీజన్లో తీసిన కేకేఆర్ ప్లేయర్లలో బ్యాటర్ కం స్పిన్నర్ సునీల్ నరైన్ 5సార్లతో ముందున్నాడు. అతను 2012, 13, 14, 18, 21సీజన్లలో 15కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. తర్వాత రస్సెల్ (2016, 22), ఉమేష్ యాదవ్ (17, 22), కల్లిస్ (12, 13), వరుణ్ చక్రవర్తి (20, 21) సీజన్లలో 15కన్న ఎక్కువ వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications












