ఈడెన్‌లో KKR vs KXIP: హెడ్ టు హెడ్ రికార్డు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 8 గంటలకి జరిగే ఈ మ్యాచ్‌కి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సొంతగడ్డపై ఇది రెండో మ్యాచ్ కావడం విశేషం.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని గెలిపించిన హిట్టర్ ఆండ్రీ రసెల్ (49 నాటౌట్) సూపర్ ఫామ్‌లో ఉండగా.. రాజస్థాన్‌పై రాయల్స్‌పై మెరుపు హాఫ్ సెంచరీతో క్రిస్‌గేల్ (79) జోరుమీదున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఈ విండిస్ దిగ్గజాలు ఎలా ఆడతారోనని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

మరో 2 బంతులు మిగిలి ఉండగానే
సన్‌రైజర్స్‌తో నిర్దేశించిన 182 పరుగుల చేధనలో తడబడిన కోల్‌కతా 15.3 ఓవర్లు ముగిసే సమయానికి 118/4తో ఓడిపోయేలా కనిపించింది. అయితే, చివర్లో ఆండ్రూ రసెల్ విజృంభణతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా విజయాన్ని అందుకుంది. అంతేకాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా అందుకున్నాడు.

క్రిస్‌గేల్ హాఫ్ సెంచరీ
మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా గత సోమవారం జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్ హాఫ్ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన రాజస్థాన్ 170 పరుగులే చేయడంతో 14 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
KKR vs KXIP ఐపీఎల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో
మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది?
బుధవారం, రాత్రి 8 గంటలకు
లైవ్ టీవీలో మ్యాచ్‌ని ఎక్కడ వీక్షించాలి?
స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
KKR vs KXIP: IPL హెడ్ టు హెడ్ రికార్డు
ఐపీఎల్‌లో ఇప్పటివ రకు ఆడిన మ్యాచ్‌లు: 23
KKR గెలిచిన మ్యాచ్‌లు: 15
KXIP గెలిచిన మ్యాచ్‌లు: 8
ఫలితం తేలనివి: 0
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications