Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR VS GT: ఆ ఇద్దరు జట్టులోకి వచ్చారు.. నో టెన్షన్!

KKR VS GT: ఐపీఎల్ 2025లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగనుంది. కేకేఆర్ జట్టులోకి ఇద్దరు ఆటగాళ్లు వచ్చారు.

ఏ కెప్టెన్‌కు అయినా అతడంటే ఇష్టమే..
గిల్ మాట్లాడుతూ.. "నాకు ఈ పిచ్ పై తేమ ఉన్నట్లు అనిపించడం లేదు. అందరూ వికెట్లు తీస్తూ బాగా సహకరిస్తున్నారు. మైదానంలో (ఫీల్డింగ్) రషీద్ ఖాన్ ఎనర్జీ చూస్తే- ఏ కెప్టెన్‌ అయినా ఇలాంటి ఆటగాడిని తన జట్టులో ఉండాలని అనుకుంటాడు " అని చెప్పాడు.

ఆ ఇద్దరు వచ్చారు.. నో టెన్షన్..
రహానే మాట్లాడుతూ.. "మేము మొదట బౌలింగ్ చేస్తాం. పచ్ కాస్త పొడిగా ఉంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ ఎలా ఉందో మరింత స్పష్టత వస్తుంది. మా ఆటగాళ్లందరూ బాగా శ్రమిస్తున్నారు. మిడిల్-ఆర్డర్ గురించి ఎక్కువగా ఆందోళన లేదు. గుర్బాజ్ జట్టులోకి వచ్చాడు. మొయిన్ అలీ కూడా జట్టులోకి వచ్చాడు." అని పేర్కొన్నాడు.

కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
రెహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

KKR Vs GT: గుజరాత్ తుది జట్టు ఇదే
శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

KKR VS GT IPL 2025 Kolkata Knight Riders won toss against Gujarat Titans
Story first published: Monday, April 21, 2025, 19:23 [IST]
Other articles published on Apr 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+