Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs GT: ఆ మ్యాచ్ నుంచి అతడిని నిషేధించారా?

KKR vs GT: క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఫిర్యాదు కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు తనను దూరంగా ఉంచారనే ఊహాగానాలను ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే తోసిపుచ్చారు. కోల్‌కతాలో జరిగిన రెండు మ్యాచ్‌ల కోసం మాత్రమే తనను ప్యానెల్‌లో చేర్చారని, ఆ రెండు మ్యా‌చ్‌లు ఇప్పుడు ముగిశాయని ఆయన తెలిపారు. దాదాపు 10 రోజుల క్రితం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) కార్యదర్శి నరేష్ ఓజా భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి పంపిన లేఖ గురించి మీడియా నివేదికలు వెలువడిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వివరణ ఇచ్చారు.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్థానిక ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సహాయం చేయడం లేదని హర్ష భోగ్లే, న్యూజిలాండ్‌కు చెందిన సైమన్ డౌల్ చెప్పిన తర్వాత కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌లకు వ్యాఖ్యాత ప్యానెల్ నుంచి వారిని తొలగించాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) ఆ లేఖలో కోరింది. న్నటి మ్యాచ్ కోసం నేను కోల్‌కతాలో ఎందుకు లేను అనే దానిపై కొన్ని అన్యాయమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు' అని భోగ్లే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సరళంగా చెప్పాలంటే తాను వ్యాఖ్యానించాల్సిన మ్యాచ్‌ల జాబితాలో అది లేదన్నాడు.

KKR vs GT Harsha Bhogle Clarifies Rumors on CAB Complaint and Commentary Panel Exclusion

'నన్ను అడిగితే సమస్య పరిష్కారమై ఉండేది. టోర్నమెంట్ ప్రారంభాననికి ముందే జాబితా సిద్ధం చేయబడింది. నేను కోల్‌కతాలో జరిగిన రెండు మ్యాచ్‌లకు ఎంపికయ్యాను. మొదటి మ్యాచ్ కు నేను అక్కడ ఉన్నాను. కుటుంబ సభ్యుడి అనారోగ్యం కారణంగా రెండో మ్యాచ్‌కు చేరుకోలేకపోయాను." అని హర్ష భోగ్లే అన్నారు.

తమ సొంత మైదానంలో స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్ లభించకపోవడం పట్ల కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే, ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ ఇద్దరూ నిరాశను వ్యక్తం చేశారు. వారికి కామెంటేటర్లు హర్ష భోగ్లే, సైమన్ డౌల్ లు మద్దతుగా నిలిచారు. తాను ఏదైనా చెబితే గందరగోళం ఏర్పడుతుందని కొన్ని మ్యాచ్ ల తర్వాత కూడా హర్ష భోగ్లే చెప్పారు. అయితే దీని తర్వాత పరిస్థితి కొంతవరకు సద్దుమణిగింది. కానీ సొంత మైదానంలో కేకేఆర్ పరాజయాల పరంపర కొనసాగుతోంది.

సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 198 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా కోల్‌కతా 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ జట్టు నుంచి కెప్టెన్ అజింక్య రహానే మాత్రమే పోరాడాడు. అజింక్యా రహానే 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఓటమి తర్వాత కేకేఆర్ సమస్యలు పెరిగాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్‌ల్లో 5 ఓటములను చవిచూసింది. ఈ క్రమంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా కష్టంగా మారాయి.

Story first published: Tuesday, April 22, 2025, 14:55 [IST]
Other articles published on Apr 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+