Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR Vs DC Toss Update: టాస్ గెలిచిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్.. ఢిల్లీ జ‌ట్టులో ఒక మార్పు

KKR Vs DC Toss Update: Kolkata Knight Riders Won The Toss And Elected to Bowl First.. One Change In Delhi capitals team

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రిష‌బ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. గ‌త మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతుంది. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ మాత్రం ఒక మార్పుతో ఆడుతుంది.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఏమ‌న్నాడంటే..

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఏమ‌న్నాడంటే..

''మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. నేను మైదానంలోకి వ‌చ్చి పిచ్ ఉపరితలం తాకినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇది మెరుగవుతుందని భావిస్తున్నాను. మా ప్లేయ‌ర్లు బాగా ఆడుతున్నారు. మేము ఇదే స్థిరత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఇటువంటి అద్భుతమైన టీంకు కెప్టెన్‌గా ఉండటం చాలా బాగుంది. ఈ మ్యాచ్‌లో మేము ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతున్నాం.'' అని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.

రిషబ్ పంత్ ఏమ‌న్నాడంటే..

రిషబ్ పంత్ ఏమ‌న్నాడంటే..

''ఈ వికెట్‌పై మొదట బ్యాటింగ్ చేయడం క‌ష్టంగా ఉంటుంది. టాస్ గెలిస్తే మేము కూడా మొద‌ట బౌలింగే చేయాల‌నుకున్నాం. ఈ వికెట్ క‌చ్చితంగా చాలా బాగుంది. త‌క్కువ తేడాతో మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురవుతుంటాం. కానీ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ఈ రోజు మంచు లేక‌పోవ‌డం ఒక మంచి ఉప‌శ‌మ‌నం. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాయి. అన్రిచ్‌ నోర్ట్జే స్థానంలో ఖలీల్ అహ్మ‌ద్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.'' అని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ తెలిపాడు.

 తుది జ‌ట్లు:

తుది జ‌ట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్/ కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(వికెట్ కీప‌ర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్ర‌వ‌ర్తి.

హెడ్ టూ హెడ్ రికార్డులు

హెడ్ టూ హెడ్ రికార్డులు

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఇప్ప‌టివ‌రకు 29 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. అయితే ఇందులో కోల్‌క‌తాదే పై చేయిగా ఉంది. కోల్‌క‌తా 16 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్‌ల్లో ఫ‌లితం తేల‌లేదు. ఇక ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డిన‌ప్పుడు ఓ మ్యాచ్‌లో అత్య‌ధికంగా కోల్‌క‌తా 210 ప‌రుగులు చేయ‌గా.. ఢిల్లీ 228 ప‌రుగులు చేసింది. ఇక అత్య‌ల్పంగా కోల్‌క‌తా 97 ప‌రుగులు, ఢిల్లీ 98 ప‌రుగులు చేసింది. చివ‌రి 5 మ్యాచ్‌ల్లో కోల్‌క‌తా 3, ఢిల్లీ రెండిట్లో విజ‌యం సాధించాయి.

Story first published: Sunday, April 10, 2022, 15:27 [IST]
Other articles published on Apr 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+