For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతా vs ఢిల్లీ: ఓటమిపై షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌

KKR vs DC: ShahRukh Khan Posts Message For Sourav Ganguly After Loss

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) సీజన్-12లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వరుసగా రెండోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా కోల్‌కతా, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. మ్యాచ్ టై అయినా సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది. ఇక మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమిపై కోల్‌కతా జట్టు యజమాని షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశాడు.

'శుభ్‌మన్‌ గిల్‌, ఆండ్రీ రసెల్‌ మరోసారి బాగా ఆడారు. ఓటమి ఫర్వాలేదు.. కానీ మా ఆట బాగాలేదు. మా బౌలింగ్‌ బాగా నిరాశపరిచింది. అయితే ఈడెన్‌లో మా దాదా (గంగూలీ) గెలుపొందిన జట్టువైపు ఉండటం సానుకూల అంశం. విజయం సాధించిన ఢిల్లీకి అభినందనలు' అని షారుక్‌ ఖాన్ ట్వీట్‌ చేశాడు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 65( 39 బంతుల్లో; 4x7, 2x6).. స్టార్ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ 45 (21 బంతుల్లో; 4x3, 4x6 ) పరుగులు చేశారు. లక్ష ఛేదనలో ఢిల్లీ 18.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ 97 (63 బంతుల్లో; 4x11, 2x6) పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్‌ కూడా 46 పరుగులతో చెలరేగాడు.

Story first published: Sunday, April 14, 2019, 12:06 [IST]
Other articles published on Apr 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+