Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs DC Playing 11: బ‌రిలోకి తెలుగు కుర్రాడు.. కీల‌క మార్పుల‌తో బ‌రిలోకి కోల్‌క‌తా, ఢిల్లీ జ‌ట్లు

KKR vs DC Playing 11: Srikar Bharat in Delhi.. Key Changes in Kolkata knight riders and Delhi capitals Final Squads

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో నేడు కూడా రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ముంబైలోని బ్ర‌బోర్న్ స్టేడియం వేదిక‌గా మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభం కానున్న మ‌రో మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌లు ఆడిన కోల్‌క‌తా 3 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ ప్లేసులో ఉంది. ఇక 3 మ్యాచ్‌ల్లో ఒక విజ‌యం సాధించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. నేడు మ‌ధ్యాహ్నం ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్న నేప‌థ్యంలో వాటి ప్లేయింగ్ 11పై ఆస‌క్తి నెల‌కొంది.

 కోల్‌కతా బ్యాట‌ర్లు వీళ్లే

కోల్‌కతా బ్యాట‌ర్లు వీళ్లే

ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టులో పెద‌గా మార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అయితే ఒక వేళ అవ‌స‌ర‌మైతే ఒకటి, రెండు కీల‌క మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ కోల్‌క‌తా ఇన్నింగ్స్‌ను అజింక్య ర‌హానే, వెంక‌టేష్ అయ్య‌ర్ ప్రారంభించనున్నారు. మూడో స్థానంలో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్, నాల్గో స్థానంలో వికెట్ కీప‌ర్ సామ్ బిల్లింగ్స్ బ్యాటింగ్ చేయ‌నున్నారు. ఐదో స్థానంలో నితీష్ రానా స్థానంలో బాబా ఇంద్రజిత్‌ను ఆడించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే రానా వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్నాడు.

 ఆల్‌రౌండ‌ర్ల‌తో బ‌లంగా

ఆల్‌రౌండ‌ర్ల‌తో బ‌లంగా

ఇక ఆరో స్థానంలో ఆండ్రూ ర‌సెల్, ఏడో స్థానంలో పాట్ క‌మిన్స్‌, ఎనిమిదో స్థానంలో సునీల్ న‌రైన్ ఆడ‌నున్నారు. వీరు ముగ్గురు ఆల్‌రౌండ‌ర్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఓపెన‌ర్ వెంక‌టేష్‌ అయ్య‌ర్ కూడా ఆల్‌రౌండ‌రే. దీంతో మొత్తంగా న‌లుగురు ఆల్‌రౌండ‌ర్ల‌తో కోల్‌క‌తా జ‌ట్టు బ‌లంగా క‌నిపిస్తోంది. ఇక బౌల‌ర్లుగా రాసిఖ్ సలామ్, ఉమేష్ యాద‌వ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఈ మ్యాచ్‌లోనూ బ‌రిలోకి దిగ‌నున్నారు.

ఢిల్లీ బ్యాట‌ర్లు వీళ్లే

ఢిల్లీ బ్యాట‌ర్లు వీళ్లే

ఢిల్లీ బ్యాటింగ్‌లో ఒక మార్పు చోటు చేసుకునే అవ‌కాశాలున్నాయి. ఓపెన‌ర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్న‌ర్ ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఇక మూడో స్థానంలో రిష‌బ్ పంత్, నాల్గో స్థానంలో స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ ఆడ‌నుండ‌గా.. రోవ్‌మాన్ పావెల్ స్థానంలో తెలుగు కుర్రాడు శ్రీ‌క‌ర్‌ భ‌ర‌త్‌ను ఆడించే అవ‌కాశాలు ఉన్నాయి. అత‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆరో స్థానంలో ల‌లిత్ యాద‌వ్ ఆడ‌నున్నాడు.

 బౌల‌ర్లు వీళ్లే

బౌల‌ర్లు వీళ్లే

ఏడు, ఎనిమిది స్థానాల్లో ఆల్‌రౌండ‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేయ‌నున్నారు. ఇక బౌల‌ర్లుగా కుల్దీప్ యాద‌వ్, అన్రిచ్ నోర్జే, ముస్తిఫిజ‌ర్ ర‌హ్మామాన్ కొన‌సాగ‌నున్నారు.

తుది జ‌ట్లు (అంచ‌నా)

తుది జ‌ట్లు (అంచ‌నా)

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(వికెట్ కీప‌ర్), నితీష్ రానా లేదా బాబా ఇంద్ర‌జిత్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌:

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్/ కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్ లేదా శ్రీ‌క‌ర్ భ‌ర‌త్‌, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నోర్జే.

Story first published: Sunday, April 10, 2022, 10:52 [IST]
Other articles published on Apr 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+