For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. ప్రసీద్, రస్సెల్ ఔట్! పృథ్వీ షా స్థానంలో స్టీవ్ స్మిత్!!

KKR vs DC playing 11 is out: Tim Southee comes in for Andre Russell, Steve Smith played for delhi

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మంగళవారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరికొద్దిసేపట్లో షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మోర్గాన్ రెండు మార్పులు చేశాడు. పేసర్ ప్రసీద్ కృష్ణ బదులుగా సందీప్ వారియర్.. ఆండ్రీ రస్సెల్ స్థానంలో టీమ్ సౌథీ జట్టులోకి వచ్చారు. మరోవైపు ఢిల్లీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన పృథ్వీ షా స్థానంలో స్టీవ్ స్మిత్ ఆడుతున్నాడు. మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

ఐపీఎల్ 2021 మొదటి లెగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగించిన జోరునే రెండో దశలోనూ కొనసాగిస్తోంది. వరుస విజయలతో ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంది. ఢిల్లీ ఇప్పటికే 8 విజయాలతో పాయింట్ల పట్టికలో 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి అధికారిక బెర్త్ దక్కించుకోవాలని చూస్తోంది. ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ ఈసారి టైటిల్ లక్ష్యంగా ఆడుతోంది. మరోవైపు కోల్‌కతా 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీపై గెలుపొంది ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లాలని చూస్తోంది.

ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 14, ఢిల్లీ 12 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. రికార్డ్స్ పరంగా చూస్తే.. ఇరు జట్ల మధ్య మ్యాచులు రసవత్తరంగానే సాగాయి. షార్జాలో బౌండరీలు చిన్నగా ఉన్నప్పటికీ, రన్ స్కోరింగ్ అంత సులభం కాదు. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంతి బ్యాట్స్‌మన్‌పైకి దూసుకొచ్చింది. పిచ్‌ ఉపరితలం నెమ్మదిగా ఉంది. మైదానం చిన్నదే అయినా బౌండరీలు రావడం కాస్త కష్టమే. అయితే క్రీజులో బ్యాట్స్‌మెన్స్ కుదురుకుంటే.. పరుగులు సాధించడం తేలికే.

తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: శుభ్‌మన్‌గిల్‌, వెంకటేశ్ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), నితీశ్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌, సునీల్‌ నరైన్‌, లాకీ ఫెర్గూసన్‌, టిమ్‌ సౌథీ, వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌.
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్‌మెయర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, అవేష్ ఖాన్.

Story first published: Tuesday, September 28, 2021, 15:29 [IST]
Other articles published on Sep 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+