Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BCCIకి భయపడి.. కిస్‌ను కంట్రోల్ చేసుకున్న హర్షిత్ రాణా (Video)

ఈడెనె గార్డెన్స్ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మది వికెట్లకు 153 పరుగులు చేసింది. కుల్‌దీప్ యాదవ్ (35; 26 బంతుల్లో, 5x4, 1x6), రిషభ్ పంత్ (27; 20 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్లు.

వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లుతో (3/16)తో సత్తాచాటాడు. హర్షిత్ రాణా (2/28), వైభవ్ అరోరా (2/29) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు వచ్చిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. ఫిల్ సాల్ట్ (68; 33 బంతుల్లో, 7x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (33*; 23 బంతుల్లో, 3x4, 1x6), వెంకటేశ్ అయ్యర్ (26*; 23 బంతుల్లో, 2x4, 1x6) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

KKR vs DC Harshit Rana Halts Another Flying-Kiss Send-Off Recalls BCCI Punishment

అయితే ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు యత్నించిన అభిషేక్ పోరెల్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం హర్షిత్ తన స్టైల్‌లో ఫ్లైయింగ్ కిస్‌తో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నాడు. దాని కోసం చేతిని కూడా తన ముఖానికి దగ్గరగా తీసుకువచ్చాడు. కానీ ఒక్కసారిగా ఆ సెలబ్రేషన్స్ ఆపేశాడు. ఎందుకంటే...

ఈ సీజన్ ఆరంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఘటన హర్షిత్ రాణాకు గుర్తు వచ్చింది. ఈ మ్యాచ్‌లో‌ అతిగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ కోడ్ ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 60 శాతం జరిమానా విధించింది. మయాంక్ యాదవ్‌ను ఔట్ చేసిన తర్వాత హర్షిత్ బయటకు వెళ్లూ అంటూ సింబాలిక్‌గా చూపించాడు. అంతేగాక మాయంక్‌కు దగ్గర‌గా వచ్చి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు.

దీనిపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. హర్షిత్‌కు వార్నింగ్ ఇచ్చి జరిమానా విధించింది. అప్పటి నుంచి హర్షిత్ కామ్‌ అయిపోయాడు. కానీ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫైన్ విషయం మరిచిపోయి మరోసారి ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్స్ చేసుకోబోయాడు. కానీ జరిమానా గుర్తొచ్చి వెంటనే సెలబ్రేషన్స్‌ను ఆపేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Tuesday, April 30, 2024, 12:53 [IST]
Other articles published on Apr 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+