KKRvsDC Dream11:కేకేఆర్ vs డీసీ ప్లేయింగ్ ఎలెవన్..డ్రీమ్ 11 టీమ్!పిచ్ రిపోర్ట్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2021లో భాగంగా మంగళవారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడనుండగా.. 3.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండనుంది. అలాగే స్టార్ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లోనూ అభిమానులు మ్యాచ్ చూడవచ్చు.

ఢిల్లీ ఇప్పటికే 8 విజయాలతో పాయింట్ల పట్టికలో 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి అధికారిక బెర్త్ దక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు కోల్‌కతా 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీపై గెలుపొంది ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లాలని చూస్తోంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 14, ఢిల్లీ 12 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. రికార్డ్స్ పరంగా చూస్తే.. ఇరు జట్ల మధ్య మ్యాచులు రసవత్తరంగానే సాగాయి. షార్జాలో బౌండరీలు చిన్నగా ఉన్నప్పటికీ, రన్ స్కోరింగ్ అంత సులభం కాదు.

పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంతి బ్యాట్స్‌మన్‌పైకి దూసుకొచ్చింది. పిచ్‌ ఉపరితలం నెమ్మదిగా ఉంది. మైదానం చిన్నదే అయినా బౌండరీలు రావడం కాస్త కష్టమే. అయితే క్రీజులో బ్యాట్స్‌మెన్స్ కుదురుకుంటే.. పరుగులు సాధించడం తేలికే. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ గాయపడ్డాడు. ఢిల్లీతో జరిగే మ్యాచులో అతడు ఆడేది అనుమానంగా ఉంది. ఒకవేళ రస్సెల్ ఆదుకుంటే.. అతడి స్థానంలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ జట్టులోకి రానున్నాడు.

 టైటిల్ గెలవాలని

టైటిల్ గెలవాలని

ఐపీఎల్ 2021 మొదటి లెగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగించిన జోరునే రెండో దశలోనూ కొనసాగిస్తోంది. వరుస విజయలతో ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. అలాగే బౌలర్లు కూడా బంతితో రాణించడంతో వరుస విజయాలు అందుకుంటుంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు తప్పులు చేసినా త్వరగానే సరిదిద్దుకుంటోంది. ఇక శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో ఢిల్లీ జట్టు మరింత బలపడింది. మొదటి ఐపీఎల్ టైటిల్ గెలవాలని ప్రయత్నిస్తున్న ఢిల్లీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. చివరి సీజన్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ ఓడిపోయిన విషయం తెలిసిందే.

పటిష్టంగా ఢిల్లీ

పటిష్టంగా ఢిల్లీ

ఢిల్లీకి పృథ్వీ షా, శిఖర్ ధావన్ రూపంలో దూడైన ఓపెనర్లు ఉన్నారు. ముఖ్యంగా షా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీల మోత మోగిస్తున్నాడు. అయితే భారీ స్కోర్ మాత్రం చేయడం లేదు. గబ్బర్ విలువైన పరుగులు చేస్తున్నా.. తన సత్తాచాటడం లేదు. దాంతో వీరిద్దరూ ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డారు. శ్రేయాస్ అయ్యర్ ఫేజ్ 2లో జరిగిన రెండు మ్యాచ్‌లలో నిరూపించుకున్నడు. సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచులో 41 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

రాజస్థాన్ రాయల్స్‌పై 43 పరుగులు సాధించి జట్టుకు సునాయాస విజయం అందించాడు. రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్‌మెయర్ చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు. అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్జ్, అవేష్ ఖాన్ రూపంలో నికార్సైన బౌలింగ్ ఉంది.

వెంకటేశ్ అయ్యర్ ఆడుకునేనా

వెంకటేశ్ అయ్యర్ ఆడుకునేనా

కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్ రూపంలో మంచి యువ బ్యాట్స్‌మెన్‌ దొరికాడు. 26 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ అయిన అయ్యర్ ఇప్పటివరకు 3 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి సత్తాచాటాడు. బ్యాట్‌తో విలువైన పరుగులు సాధిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. అయ్యర్ 3 మ్యాచ్‌ల్లో 112 పరుగులు చేశాడు. దాంతో అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయ్యర్‌తో పాటు శుభ్మన్ గిల్ కూడా కేకేఆర్‌కు మంచి భాగస్వామ్యాలు అందిస్తున్నాడు. రాహుల్ త్రిపాఠి పరుగుల వరద పారిస్తున్నాడు.

ఫేజ్ 2 లో ఆడిన 2 ఇన్నింగ్స్‌లలో 119 పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ కూడా తమవంతుగా పరుగులు చేస్తున్నారు. సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తిలతో పటిష్ట బౌలింగ్ ఉంది. రెండవ దశలో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 2 మ్యాచులు గెలిచింది. ఈ రోజు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

తుది జట్లు

తుది జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, షకీబ్ అల్ హసన్/ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్‌మెయర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, అవేష్ ఖాన్.

డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, పృథ్వీ షా, శుభ్మన్ గిల్, సునీల్ నరైన్, సామ్ బిల్లింగ్, అవేష్ ఖాన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్ (వైస్ కెప్టెన్).

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 28, 2021, 12:23 [IST]
Other articles published on Sep 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X