
అబుదాబి: అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్‌స్టో (5) పూర్తిగా నిరాశపరచగా.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (36; 30 బంతుల్లో 2x4, 1x6) పర్వాలేదనిపించాడు. అయితే కీలక ఆటగాళ్లు అయిన ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. కోల్‌కతా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగుతున్నాడు. అయితే మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దెందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (5) జట్టు స్కోరు 24 వద్ద పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ 2020లో అత్యధిక ధర పలికిన పాట్ కమిన్స్ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్ స్టో బౌల్డ్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం తన సహజ శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నంత సేపు ఎక్కువగా సింగిల్స్ తీయడానికే ప్రయత్నించాడు. 30 బంతుల్లో కేవలం 2 రెండు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే బాదాడు. ఇక యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన 10వ ఓవర్ తొలి బంతికే వార్నర్ .. రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఐపీఎల్ 2020లో చక్రవర్తికి ఇదే మొదటి వికెట్. అయితే మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దెందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు వృద్ధిమాన్ సాహా పాండేకు చక్కటి సహకారం అందిస్తున్నాడు.
10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ఇక్కడి నుంచి మనీష్ గేర్ మార్చాడు. రెండు ఫోర్లు బాది మంచి టచ్‌లోకి వచ్చాడు. 14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. మనీశ్ పాండే (37), వృద్ధిమాన్ సాహా(13) క్రీజులో ఉన్నారు. గత మ్యాచులో తేలిపోయిన పాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 3 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.