Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR v SRH: సమయం ముగిసిన తర్వాత రివ్యూ కోరిన దినేష్ కార్తీక్.. అనుమతించిన ఫీల్డ్ అంపైర్!!

KKR v SRH: Dinesh karthik takes review for LBW after 15 seconds is over

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ వేసిన ఏడో ఓవర్‌ రెండో బంతికి కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎల్బీడబ్లూ అయిన కార్తీక్‌.. 15 సెకన్ల తర్వాత రివ్యూ కోరాడు. అయితే ఫీల్డ్ అంపైర్.. కార్తీక్ చేసిన అప్పీల్‌ను అనుమతించాడు.

రషీద్‌ అప్పీల్ చేయగా:

రషీద్‌ అప్పీల్ చేయగా:

ఐదవ ఓవర్ నాలుగో బంతికి నితీష్ రాణా పెవిలియన్ చేరిన అనంతరం దినేశ్‌ కార్తీక్‌ క్రీజులోకి వచ్చాడు. ఆ ఓవర్లోని మిగతా రెండు బంతులను ఎదుర్కొన్న కార్తీక్.. ఒక్క పరుగు కూడా చేయలేదు. 6 ఓవర్ మొత్తం శుభ్‌మన్‌ గిల్‌ ఆడాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన ఏడో ఓవర్ మొదటి బంతిని గిల్ ఎదుర్కొని సింగల్ తీశాడు. రెండో బంతిని ఆడిన కార్తీక్‌.. ఎల్బీడబ్లూ అయ్యాడు. రషీద్‌ అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ ఇచ్చాడు. వెంటనే కార్తీక్‌ పెవిలియన్ వైపు నడుకుంటూ రెండు అడుగులు వేశాడు.

సమయం ముగిసిన తర్వాత:

సమయం ముగిసిన తర్వాత:

వెనక్కి వచ్చిన దినేశ్‌ కార్తీక్.. శుభ్‌మన్‌ గిల్‌తో మాట్లాడిన అనంతరం రివ్యూ కోరాడు. అప్పటికే రివ్యూ సమయం (15 సెకన్లు) దాటిపోయింది. అయినా ఫీల్డ్ అంపైర్.. కార్తీక్ చేసిన అప్పీల్‌ను అనుమతించాడు. థర్డ్ అంపైర్ టీవీలో రిప్లై చూసి.. ఫీల్డ్ అంపైర్‌కు తన నిర్ణయం చెప్పాడు. ఫీల్డ్ అంపైర్ కార్తీన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. రివ్యూ సమయం మించిపోయిన సమయాన్ని ఫీల్డ్ అంపైర్ సహా థర్డ్ అంపైర్ కూడా పట్టించుకోలేదు. దీంతో అంపైర్ తప్పిదం మరోసారి బయటపడింది.

శుభ్‌మన్‌ హాఫ్ సెంచరీ:

శుభ్‌మన్‌ హాఫ్ సెంచరీ:

లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రాణా..ఖలీల్‌ అహ్మద్‌ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాది 14 రన్స్‌ రాబట్టాడు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ చేజార్చుకున్నాడు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ నటరాజన్‌ వేసిన ఐదో ఓవర్లో నితీశ్‌ రాణా (26) కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆపై కార్తీక్‌ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. అయితే యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(59) అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఇయాన్ మోర్గాన్‌ (29) అతనికి అండగా నిలిచాడు. 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్లకు 120 పరుగులు చేసింది.

Story first published: Saturday, September 26, 2020, 23:10 [IST]
Other articles published on Sep 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+