For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమాన హీరో విజ‌య్‌ని కలిసిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ స్పిన్నర్!!

KKR Spinner Varun Chakravarthy met his idol Thalapathy Vijay

చెన్నై: క్రికెట్‌, సినిమాకు ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉంటుంది. కొందరు స్టార్ క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. సినీ సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన క్రికెట‌ర్ ఆటను చూసేందుకు స్టేడియానికి వెళ్తారు. అలాగే క్రికెట‌ర్లు త‌మ అభిమాన న‌టుల‌ను క‌ల‌వాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ‌తారు. ఈ కోవకు చెందినవాడే కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ స్పిన్నర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి. వ‌రుణ్ త‌న అభిమాన హీరో విజ‌య్‌ను ఎప్ప‌టినుంచో కలవాలనుకుంటున్నాడు. చివ‌రికి కలిశాడు కూడా.

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న అభిమాన హీరో విజ‌య్‌ను ఎప్ప‌టినుంచో క‌ల‌వాల‌ని ఓ కోరిక. దీంతో తమిళ్ స్టార్ హీరో, ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆఫీసుకు వెళ్లి మ‌రీ వ‌రుణ్ అతడిని కలిశాడు. ఇద్దరూ క‌లిసి కాసేపు ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటోను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఒకే ఫ్రేములో ఇద్ద‌రు సెల‌బ్రిటీల‌ను ఔరా అనిపించారు. విజ‌య్ న‌టిస్తోన్న 'మాస్ట‌ర్' చిత్రం కోసం అభిమానుల‌తో పాటు వ‌రుణ్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. విజ‌య్ కూడా క్రికెట్‌కు వీరాభిమాని. 2008 ఐపీఎల్ లీగ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యవహరించాడు.

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జట్టు‌లో ఆడి మంచి ప్రదర్శనతో ఆక‌ట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఓ మ్యాచులో ఏకంగా ఐదు వికెట్లతో మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శన బీసీసీఐ సెలెక్టర్లను ఆకర్షించిందేమో కానీ.. ఆసీస్‌ పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో అతడు చాన్స్‌ కొట్టేశాడు. కానీ భుజం నొప్పితో బాధ‌ప‌డుతున్నందు వ‌ల్ల ఈ స్టార్ స్పిన్న‌ర్‌ టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు.

తమిళనాడుకు చెందిన వరుణ్‌ 13వ ఏట నుంచి క్రికెట్‌ ఆడుతున్నాడు. 17వ ఏట వరకు వికెట్‌ కీపర్‌గా ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో ఆడాడు. అయితే అక్కడ ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు. నిరాశకు గురైన వరుణ్‌ ఆటను వదిలి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ డిగ్రీలో చేరాడు. ఆ తర్వాత ఫ్రీలాన్స్‌ ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నా.. క్రికెట్‌ను మర్చిపోలేకపోయాడు. దీంతో మళ్లీ క్రికెట్‌ వైపు అడుగులు వేశాడు. క్రోమ్‌బెస్ట్‌ క్రికెట్‌ క్లబ్‌లో సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా చేరాడు. కానీ మోకాలి గాయం రూపంలో దురదృష్టం మరోసారి వెంటాడింది. ఆ తర్వాత స్పిన్నర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ ఊచకోత నుంచి తప్పించుకోవడానికి ఆర్కిటెక్ట్‌ బుర్రతో తన బౌలింగ్‌కు పదునుపెట్టాడు. తనను తాను మిస్టీరి‌ స్పిన్నర్‌గా ఆవిష్కరించుకున్నాడు. కొంతకాలం క్లబ్‌ క్రికెట్‌లో రాణించాడు.

2018లో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌తో సత్తా చాటేందుకు అవకాశం వచ్చింది. ఆ లీగ్‌లో మధురై పాంథర్స్‌ తరఫున ఆడిన వరుణ్‌.. ఆ జట్టుకు తొలి టైటిల్‌ అందించాడు. దాంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నెట్స్‌లో కూడా బౌలింగ్‌ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సమయంలో కోల్‌కతా జట్టు స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌, స్పిన్‌ కోచ్‌ కార్ల్‌ క్రో వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. ఆపై తమిళనాడు తరఫున విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడి సత్తాచాటాడు. రంజీల్లో కూడా ఆడాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ తరఫున ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. గతేడాది ఐపీఎల్‌ వేలంలో రూ. 20 లక్షల కనీస ధర ఉన్న వరుణ్‌ను.. పంజాబ్‌ ఏకంగా రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ వరుణ్ సత్తాచాటలేకపోయాడు. దీంతో పంజాబ్‌ వదిలేసింది. ఈ ఏడాది కోల్‌కతా రూ. 4 కోట్లకు దక్కించుకుంది. ఈ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు.

Story first published: Tuesday, November 17, 2020, 22:18 [IST]
Other articles published on Nov 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+