Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆండ్రీ రస్సెల్ బలహీనత ఏంటో తెలుసా!: బయటపెట్టిన కుల్దీప్

IPL 2019 : Kuldeep Yadav Reveals Andre Russell's Only Weakness || Oneindia Telugu
KKR spinner Kuldeep Yadav reveals teammate Andre Russells weakness

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ వీక్‌నెస్‌ను బయటపెట్టాడు ఆ జట్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఈ సీజన్‌లో‌ ఆండ్రీ రస్సెల్ కోల్‌కతాకు ఒంటిచేత్తో విజయాలనందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఆండ్రీ రస్సెల్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా విజృంభిస్తున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆండ్రీ రస్సెల్‌కు బలహీనతలు

ఆండ్రీ రస్సెల్‌కు బలహీనతలు

అయితే, ఆండ్రీ రస్సెల్‌కు బలహీనతలు ఉన్నాయని ఆ జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పాడు. బంతిని ఎక్కువగా టర్న్ చేస్తే రసెల్ ఆడలేడని కుల్దీప్ యాదవ్ అన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆండ్రీ రస్సెల్‌పై కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ "బంతిని ఎక్కువగా స్పిన్ చేస్తే రస్సెల్ ఇబ్బందిపడతాడు. ఇదే అతని అతిపెద్ద బలహీనత" అని అన్నాడు.

కుల్దీప్

కుల్దీప్

"ఇదే కాదు, వరల్డ్‌కప్‌లో అతన్ని కట్టడి చేసేందుకు నా వద్ద చాలా అస్ర్తాలు ఉన్నాయి. సరైన రీతిలో యార్కర్లు వేసినా రస్సెల్ తడబడతాడు" అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఢిల్లీ-కోల్‌కతా జట్లు తలపడున్నాయి. ఈ నేపథ్యంలో కుల్దీప్ మాట్లాడుతూ రస్సెల్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నానని, అయితే నెట్స్‌లో అతడికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదని చెప్పాడు.

బౌలింగ్

బౌలింగ్

"స్పిన్ బౌలింగ్‌లో షాట్లు కొట్టేందుకు రస్సెల్ సాహసం చేయడని, అదే పేస్ బౌలింగ్‌లో అయితే విజృంభిస్తాడు. ఒకవేళ నేను వికెట్లు తీయకపోతే బౌలింగ్ బాగా వేయనట్లు కాదు. పరిణతితో కూడిన క్రికెట్ ఆడుతున్నా. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ఎక్కువ. వికెట్లు దక్కకపోయినా పరుగులు ఇవ్వకుండా ఉంటే చాలు. జట్టు గెలిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది" అని కుల్దీప్ అన్నాడు.

Story first published: Friday, April 12, 2019, 16:24 [IST]
Other articles published on Apr 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+