For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతాకు షాక్: నరైన్ ఆఫ్ స్పిన్ బౌలింగుపై నిషేధం

By Pratap

ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షాక్ తగిలింది. ఐపియల్‌లో ఆ జట్టు బౌలర్ సునీల్ నరైన్ ఆఫ్ స్నిన్ బౌలింగుపై బిసిసిఐ నిషేధం విధించింది. ఈ మేరకు బిసిసిఐ బుధవారం ఓ ప్రకటన చేసింది.

బిసిసిఐ నిర్వహించే ఐపియల్‌ సహా అన్ని మ్యాచుల్లోనూ నరైన్ ఆఫ్ స్పిన్నర్స్ వేయడాన్ని నిషేధించారు. అయితే, అతను ఇతర డెలివరీలను బౌల్ చేయడానికి అవకాశం ఉంది. నుకల్, క్వికర్ స్ట్రెయిట్ బంతులు వేయవచ్చు. బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ విషయం చెప్పారు.

KKR's Sunil Narine banned from bowling off-spin in IPL 2015

ఈ ఐపియల్ సీజన్‌లో నరైన్ ఆప్ స్నిన్నర్ బంతులు వేస్తే అంపైర్లు 24.2 క్లాజు కింద నో బాల్‌గా ప్రకటిస్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత తదుపరి నివేదిక సమర్పిస్తారు. అదే పద్ధతిలో అతను కొనసాగితే బిసిసిఐ నిర్వహించే అన్ని మ్యాచుల నుంచి అతనిపై నిషేధం విధిస్తారు.

విశాఖపట్నంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఈ నెల 22వ తేదీన జరిగిన మ్యాచులో నరైన్ వేసిన కొన్ని డెలివరీల విషయంలో మ్యాచ్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. బౌలింగ్ యాక్షన్ బయోమెకానికల్ అనాలిసిస్ కోసం నరైన్ చెన్నైలోని శ్రీ రామచంద్ర అర్ణ్రోస్కోపీ, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను దర్శించాడు.

మ్యాచ్ ఫుటేజీలను, సెంటర్ అందించిన విశ్లేషణ ఆధారంగా నరైన్ వేసే బంతులు సరైనవి కావని నిర్ధారించుకున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+